రానా ఓ మంచి స్నేహితుడు..చైతు మంచి ప్రేమికుడు

Posted October 1, 2016

naga chaitanya interviewనాగ చైతన్య,రానా ల బంధుత్వం గురించి అందరికీ తెలిసిందే.ఇద్దరూ బావా బావమరుదులవుతారు.అయితే బంధుత్వాన్ని మించిన స్నేహం వాళ్ళ మధ్య వుంది.చైతు,సమంతల ప్రేమ కధని పసిగట్టింది దగ్గుబాటి రానా.అయితే ఆ విషయాన్ని చైతు ఇంట్లోచెప్పేదాకా ఎక్కడా రివీల్ కాలేదంటే ..ఆ విషయంలో రానాని మెచ్చుకోవాల్సిందే.చైతు కూడా తాజా ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.సమంత తో తాను లవ్ లో పడ్డ విషయం రానాకి తెలుసని చెప్పాడు.

ప్రేమ విషయాన్ని గుట్టుగా దాచిన చైతు కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక పెద్దగా ఆలస్యం చేయలేదు.వాళ్లకి వీళ్లకి కాకుండా నేరుగా నాన్న నాగార్జునతోనే చెప్పాడట.ఇక సమంత కెరీర్ కి తాను అడ్డు చెప్పబోనన్నారు చైతు.తన కన్నా ఆమె ఎక్కువ కష్టపడి చిత్ర రంగం లోనిలదొక్కుకుంది అని చైతు ప్రశంసించారు.సమంతతో పాటు ,ఆమె వృత్తిని,మతాన్ని గౌరవిస్తానని చెప్పడం ద్వారా చైతు మంచి ప్రేమికుడు అనిపించుకున్నారు.

SHARE