Posted [relativedate]
ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలతో జోరు మీద ఉన్న నాగచైతన్య నటిస్తున్న ప్రస్తుత సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు దర్శకత్వం వహించిన కళ్యాణకృష్ణ ఈ తాజా సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మొదట నిన్నేపెళ్లాడుతా టైటిల్ ని కన్ఫామ్ చేశారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ సినిమాకు మరో టైటిల్ ఓకే చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో తెగ వార్తలు వస్తున్నాయి.
గతంలో నాగార్జున నటించిన అల్లరి అల్లుడు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో చైతూ తాజా చిత్రానికి అల్లరి అల్లుడు అనే పేరును ఖరారు చేశారని ఫిలింనగర్ వర్గాల టాక్. అంతేకాకుండా నాగ్ ‘హలో బ్రదర్’ చిత్రంలోని ప్రియ రాగాలే అనే పాటను కూడా చైతూ సినిమాలో రీమేక్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇలా నాగార్జున సక్సెస్ చిత్రాలను బేస్ గా తీసుకుని తెరకెక్కిన ఈ చిత్రంపై అక్కినేని అభిమానుల్లో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. మరి చైతూ అల్లరి అల్లుడిగా ఎలా మెప్పిస్తాడో చూడాలి.