నాగ చైతన్య గ్రీకు వీరుడా..?

0
567

Naga--krishna

ఒక వైపున ‘సాహసం శ్వాసగా సాగిపో’ .. మరో వైపున ‘ప్రేమమ్’ సినిమా షూటింగులు పూర్తి కావడంతో, నాగచైతన్య తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు. ఈ సినిమాను కల్యాణ్ కృష్ణ తెరకెక్కించే అవకాశాలున్నాయి. ఈ చిత్రం గురించి చైతు ఫాదర్ నాగార్జున డైరక్టర్‌కు కొన్ని సూచనలు చేశారట. ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గానే కాక.. ‘నిన్నే పెళ్లాడుతా’ తరహాలో ఉండాలని కల్యాణ్ కృష్ణతో నాగ్ చెప్పినట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. నిన్నే పెళ్లాడతాలో గ్రీకు వీరుడిగా ఆదరించిన, కొడుకు కూడా లవర్ బాయ్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు

నాగ్ సూచనలతో ఆ ఫీల్ వచ్చేలా కల్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుంటున్నాడని అంటున్నారు. ‘నిన్నే పెళ్లాడుతా’ తరహాలోనే ఈ చిత్రం భారీ తారాగణంతో సందడి చేయనుందని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం వుంది.

Leave a Reply