‘ప్రేమమ్’కి ఫ్యామీలి షాక్

 Posted October 17, 2016

naga chaitanya premam movie record collections

‘ప్రేమమ్’తో ఫస్ట్ టైం బ్లాక్ బస్టర్ హిట్ కిక్కుని ఎంజాయ్ చేస్తున్నాడు నాగ చైతన్య. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 5 చిత్రాలల్లో ‘ప్రేమమ్’ ది బెస్ట్ చిత్రంగా నిలిచింది. దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వ ప్రతిభ, చైతూ నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ లాభాల బాట పట్టారు. వరల్డ్ వైడ్ గా ప్రేమమ్ ఫస్ట్ వీకెండ్ రూ.16.65 కోట్లు వసూలు చేసింది.

అయితే, దసరా సీజన్ లో రావడం ‘ప్రేమమ్’కి బాగా కలిసొచ్చింది. ‘ప్రేమమ్’ కథంతా ప్రేమకథలతో నిండిపోయి ఉన్న విషయం తెలిసిందే. వివిధ దశల్లో ఓ
యువకుడి జీవితంలోకి వచ్చిన అమ్మాయిల కథే ఇది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి యూత్ ప్రేక్షకులు బ్రహ్మరథం కడతారని భావించారు. కానీ, ప్రేమమ్ కి
ఫ్యామిలీ ప్రేక్షకులు షాకిస్తున్నారు. యూత్ ప్రేక్షకుల కంటే ఎక్కువగా ఫ్యామీస్ నే ప్రేమమ్ ని చూడ్డానికి తరలివస్తున్నారు. ప్రేమమ్ కంటే ఇటీవలే చిన్ని సినిమా వచ్చి పెద్ద విజయం సాధించిన ‘పెళ్లి చూపులు’ చిత్రానికి యూత్ ప్రేక్షకుల తాకిడి ఎక్కువగా ఉందని ట్రేడ్ వర్గాల విశ్లేషణ.

ఇప్పటికి కూడా ప్రేమమ్ కలెక్షన్స్ నిలకడగానే ఉన్నాయి. వచ్చే వారం ‘ఇజం’ వచ్చే వరకు ప్రేమమ్ కి అడ్డేలేదు. మొత్తానికి.. ఈ దసరాకి ‘ప్రేమమ్’తో
చైతూ ఫ్యామిలీ ప్రేక్షకులని కూడా ఎంటర్ టైన్ చేశాడన్నమాట.

SHARE