ప్రేమమ్ మూవీ రివ్యూ…

Posted October 7, 2016

 naga chaitanya premam movie review

టైటిల్ : ప్రేమమ్ (2016)
 నటీనటులు : నాగచైతన్య, శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్
సంగీతం : గోపిసుందర్
దర్శకత్వం : చందూ మొండేటి
నిర్మాత : ఎస్ రాధాకృష్ణ, పిడివి ప్రసాద్, ఎస్ నాగవంశీ
రిలీజ్ డేట్ : 07అక్టోబర్, 2016.

అక్కినేని నాగచైతన్య తాజా చిత్రం ‘ప్రేమమ్’. మళయాళ హిట్ చిత్రం ‘ప్రేమమ్’కి రిమేక్ ఇది. చందూ మొండేటి దర్శకత్వంలో.. అదే టైటిల్ ‘ప్రేమమ్’తో తెలుగులోకి తీసుకొస్తున్నారు. ‘మనం’ తర్వాత మరో హిట్ టేస్ట్ చూడని చైతూ.. ఆల్రెడీ హిట్టైన కథతో మెప్పించేందుకు మనముందుకొస్తున్నాడు. చైతూ.. ‘ప్రేమమ్’ దసరా కానుకగా ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

చైతూ ‘ప్రేమమ్’ పాటలు, టీజర్, ట్రైలర్స్ ఇప్పటికే హచ్ చల్ చేస్తున్నాయి. ప్రేక్షకుల మెప్పు పొందాయ్. దీంతో.. ఈ రొమాటింక్ ఎంటర్ టైనర్ అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ చిత్రంలో చైతూ సరసన శృతీహాస‌న్‌, మ‌డోన్నా స్టెబాస్టియ‌న్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జతకట్టనున్నారు. ఆల్రెడీ మళయాళ ప్రేక్షకులని మెప్పించిన ప్రేమకథతో చైతూ తెలుగు ప్రేక్షకులని మెప్పించాడా.. ? ‘ప్రేమమ్’లోని ప్రేమకథలు ఎలా ఉన్నాయి. అవి ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొన్నాయి. వివిధ వెబ్ సైట్స్ ప్రేమమ్ కి ఇచ్చిన రేటింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఓ లుక్కేద్దాం పదండీ..

కథ :
సింపుల్ గా చెప్పాలంటే.. విక్కీ (నాగ చైతన్య) జీవితంలో కలిగే మూడు ప్రేమ కథలు మరియు వాటి పరిణామాలే ఈ చిత్ర కథ. అసలు ఆ మూడు ప్రేమ కథలకు కారణాలు ఏంటి.. ? ముగ్గురు అమ్మాయిలు అతడి జీవితంలో ఎలాంటి మార్పులకు కారణం అయ్యారు.. ?? చివరకు విక్కీ ఎవరిని పెళ్లాడాడు.. ??? అన్నది ప్రేమమ్ ఫుల్ స్టోరీ.

ఇంకాస్త వివరంగా చూస్తే.. విక్కీ (నాగ చైతన్య) 10వ తరగతి 15యేళ్ల వయసులో.. ఆ ఊళ్లో కుర్రాళ్లంతా వెంటపడే అందమైన అమ్మాయి సుమ (అనుపమా
పరమేశ్వరన్)ను ఇష్టపడతాడు. సుమ కోసం ఆ వయసులోనే కవితలు, ప్రేమకథలు రాసి పడగొట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. అంతా ఓకే అనుకున్న టైంలో వీరి
ప్రేమకథని బ్రేకులు పడతాయ్. అదెలా అన్నది తెరపై చూడాలి.

జీవితంలో ఫస్ట్ లవ్ స్టోరిని ఎవ్వరు అంత ఈజీగా మరచిపోరు అంటుంటారు. విక్కీకి కూడా సుమని మర్చిపోవడానికి ఓ ఐదెళ్లు పడుతుంది. ఆ తర్వాత మనోడు కాలేజీలోకి ఎంట్రీ ఇస్తాడు. ఆ వయసులో ఉండే స్వీడు, గ్యాంగ్ గ్రూపులని మనోడు మెయిన్ టైన్ చేస్తుంటాడు. ఈసారి కాలేజీలో లెక్చరర్  గా జాయిన్ అయిన సితార వెంకటేషన్ (శృతిహాసన్)తో మరోసారి ప్రేమలో పడతాడు. ఈ ప్రేమకథ కూడా కంచిచే చేరుతుంది. అదెలా అన్నది కూడా తెరపైన చూస్తే బాగుంటుంది.

విక్కీ.. కాలేజ్ డేస్ ముగిసిపోతాయ్. హ్యాపినెస్ అంతా కాలేజీ లెక్చర్ తోనే పోయానే బాధ మనోడిని వెంటాడుతూనే ఉంటుంది. విక్రమ్ ‘ఎస్ రెస్టో’ పేరుతో రెస్టారెంట్ స్టార్ చేసి లైఫ్ లో సెటిల్ అవుతాడు. కానీ, సితార జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. ఈ టైంలోనే.. విక్కీ మనసుని తాకిన మరో అమ్మాయి. సింధు(మడోనా సెబాస్టియన్). విక్కీ మూడో లవ్వర్. విక్కీ జీవితంలోకి ఎంటరైన సింధు ఎవరు.. ?  విక్కీ మూడో ప్రేమ కథ అయినా సక్సెస్ అయ్యింది. అన్నది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :
* కథ
* నాగ చైతన్య
* సంగీతం
* కామెడీ

మైనస్ పాయింట్స్ :
* స్లో నేరేషన్
* కాస్త ఒరిజినాలిటీ మిస్సయినట్టు అనిపిస్తోంది.

నటీనటుల ఫర్ ఫామెన్స్ :
ప్రేమకథతో వచ్చిన ప్రతిసారి చైతూ సక్సెస్ అయ్యాడు. ‘ప్రేమమ్’ కూడా ఆ లిస్టులో చేరడం ఖాయం. చైతూకి ప్రేమకథలు నప్పుతాయని ప్రేమమ్ మరోసారి రుజువు చేసింది. జీవితంలోని మూడు ప్రేమకథలలో చాలా బాగా నటించాడు. చైతూ నటన ప్రేమమ్ విజయంలో మేజర్ పాత్ర వహిస్తుందని చెప్పవచ్చు. తన కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. స్కూల్ ఏజ్ లో కనిపించే అమాయకత్వం, కాలేజ్ కుర్రాడిగా హీరోయిజం, లైఫ్ సెటిల్ అయిన తరువాత వచ్చే మెచ్యూరిటీ లాంటి వేరియేషన్స్ ను చాలా బాగా చూపించాడు. హీరోయిన్స్ ముగ్గురు అనుపమా పరమేశ్వరన్, శృతిహాసన్, మడోనా సెబాస్టియన్ లు బాగా చేశారు. కింగ్ నాగార్జున ,విక్టరీ వెంకటేష్ ల గెస్ట్ అప్పియరెన్స్ సినిమాకే హైలైట్ నిలిచింది. మిగితా.. నటీనటులు ఫర్వాలేదనిపించారు.

సాంకేతికంగా :
ఎక్కడా కూడా రిమేక్ సినిమా ఛాయలు కనబడకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు చందూ మొండేటి. తెలుగు నేటివిటికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశాడు.
అక్కడక కొంచెం స్లో నేరేషన్ ఇబ్బంది పెట్టేలా ఉంది. గోపి సుందర్‌ అందించిన పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. సినిమాటోగ్రఫి చాలా బాగుంది.

తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
‘ప్రేమమ్’ ఛాయలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఉంటాయి. ప్రేమలో పడిన ప్రతివాడు.. అనుభవించే ఫీల్ మాత్రం ఒకేలా ఉంటుంది. ప్రేమమ్ చూస్తే మీ మీ.. లవ్ స్టోరీలు నెమరు వేసుకోవడం ఖాయం. లవ్ స్టోరీలని ఇష్టపడే ప్రేక్షకులకి ప్రేమమ్ పిచ్చ పిచ్చగా నచ్చేస్తోంది.

బాటమ్ లైన్ : ప్రేమమ్.. మీ ప్రేమకథలని కూడా గుర్తుచేస్తుండదోయ్..
రేటింగ్ : 3.25/5

SHARE