బన్నీ పోయాడు.. చైతు వచ్చాడు..!

0
546
naga chaitanya rarandoy veduka chuddam movie preponed

Posted [relativedate]

naga chaitanya rarandoy veduka chuddam movie preponed‘కింగ్’ నాగార్జున తన కొడుకుల ఫ్యూచర్ కోసం తెగ ఆరాటపడుతున్నాడు. నాగార్జున తనయుడిగా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయిన నాగ చైతన్య తనకంటూ ఒక సొంత ఇమేజ్ ని సంపాదించుకోవటం లో విఫలం అయ్యాడు. అందుకని నాగార్జున తన కొడుకుల కెరీర్ పై బాగా ఫోకస్ పెట్టాడు. నాగార్జున కి తన కెరీర్ లో ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ తో నాగ చైతన్య ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా సెట్ చేయించాడు,ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయిపొయింది.. మొదట ఈ సినిమాను జూన్ మొదటి వారం లో రిలీజ్ చేయాలి అని అనుకున్నారు,కానీ ఇప్పుడు ఈ సినిమాని మే నెలలోనే రిలీజ్ చేయాలి అని నాగార్జున ప్లాన్ చేస్తున్నాడు.ఎందుకంటే

‘దువ్వాడ జగన్నాథం’ మూవీ మే 19 రిలీజ్ చేయాలి అని మొదట ‘డీజే’ యూనిట్ ప్రకటించింది, కానీ ఈ సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవటంతో ఈ సినిమాని వాయిదావేశారు.. ఆ వాయిదా కూడా గత కొన్ని రోజులుగా అనుకుంటున్నట్లు జూన్ కు కూడా కాదట. ఏకంగా రెండు నెలలకు పైగా వాయిదా వేశారు.. జులై ద్వితీయార్ధంలో కానీ ఈ చిత్రం విడుదల కాదని అంటున్నారు. ‘డీజే’ వాయిదా సంగతి కన్ఫమ్ అయిపోవడంతో సమ్మర్ అడ్వాంటేజీని వాడుకోవడానికి నాగచైతన్య ముందుకొచ్చేశాడు.

‘రారండోయ్ వేడుక చూద్దాం’ మూవీ ని మొదట జూన్ తొలి వారంలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ బన్నీ సినిమా వాయిదా పడటంతో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాను ‘డీజే’ కోసం అనుకున్న మే 19వ తేదీని రిలీజ్ చేయాలని నాగార్జున ఫిక్సయినట్లు సమాచారం. 19న సినిమా థియేటర్లలోకి వస్తే ఇంకో మూణ్నాలుగు వారాల పాటు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి మంచి అడ్వాంటేజీ అవుతుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మంచి వసూళ్లు రాబట్టుకోవచ్చు. చైతూ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కూడా అందుకోవచ్చు అని నాగార్జున ప్లాన్. ఇది ‘నిన్నే పెళ్లాడతా’ తరహాలో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ తరహాలోనే నాగ్ అన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఈ చిత్రానికి. చైతూ సరసన రకుల్ ప్రీత్ కథానాయికగా నటిస్తుంది.

Leave a Reply