చైతూ, సమ్ము, త్రివిక్రమ్ కాంబో… జరిగేపనేనా..?

Posted March 18, 2017

naga chaitanya samantha and trivikram movie produced by nagarjunaనాగచైతన్య, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో దసరా నుండి ఓ కొత్త సినిమా ప్రారంభం కానుందన్న వార్త  టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను నాగార్జున నిర్మించనున్నాడని తెలుస్తోంది. తాజాగా ఈ  సినిమా గురించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో చైతూ సరసన సమంత హీరోయిన్ గా నటింస్తోందట. ఈ కాంబినేషన్ ని నాగార్జునే ఫిక్స్ చేశాడట.

చైతూ, సమంత వీరి కాంబినేషన్ అనగానే అభిమానుల్లో ఓ రేంజ్లో ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. అందుకు కారణం గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలవడమే. అంతకు మించి సమంత.. చైతూకి కాబోయే భార్య. ఈ కాంబినేషన్ లో సినిమా అంటే  వినడానికి బాగానే ఉన్నా ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదంటున్నారు సినీ విశ్లేషకులు.

చైతూ వరుసగా రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలానే తమ మ్యారేజ్ దగ్గర పడుతుండడంతో సమంత కూడా ఒప్పుకున్న సినిమాలన్నింటినీ త్వరగా కంప్లీట్ చేసే పనిలో పడింది. ఇక త్రివిక్రమ్ సంగతి చెప్పనక్కర్లేదు. పవన్ తో వచ్చే నెల నుండి సినిమాను మొదలు పెట్టనున్నాడు  త్రివిక్రమ్.  ఈ సినిమా తర్వాత ఈ దర్శకుడు మహేష్ తో, ఆ తర్వాత ఎన్టీఆర్ తో, ఆ తర్వాత బన్నీతో ఇలా వరుస కమిట్ మెంట్స్ తో ఉన్నాడు. ఇలా ఎవరికి వాళ్లు తమతమ బిజీ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్నారు. మరి ఇటువంటి టైట్ సిట్యువేషన్ లో చైతూ, సమంత, త్రివిక్రమ్ కాంబో లో సినిమా ఎలా ఉంటుందని.. అది జరిగేపని కాదంటున్నారు. కానీ రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా అన్నట్లు.. టాలీవుడ్  కింగ్ తలుచుకుంటే ఈ కాంబోలో సినిమా రావడం పెద్ద విషయం కాదు.. మరి నాగార్జున ఏం చేస్తాడో చూడాలి.

SHARE