ఎంగేజ్ మెంట్ కు వేళాయెరా!!!

0
685
naga chaitanya samantha engagement details

Posted [relativedate]

naga chaitanya samantha engagement details
టాలీవుడ్ ప్రేమపక్షులు అక్కినేని నాగచైతన్య- సమంత ఏడడుగులు నడవడం ఖాయమైపోయినా… ఎప్పుడన్నదే హాట్ టాపిక్. అంతెందుకు ఎంగేజ్ మెంట్ కూడా త్వరలోనే అంటున్నారు కానీ ఎప్పుడన్నది క్లారిటీ లేదు. అయితే ఆ ముహూర్తం ఫిక్స్ అయిపోయిందట. ఈనెల 29న సమంతకు చైతూ రింగ్ తొడగబోతున్నాడని సమాచారం. సమంత ట్విట్టర్ లో ఓ వీడియోను షేర్ చేయడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది.

‘ఏమాయ చేసావె’లో చిత్రంలోని ఓ స్టిల్‌ను చెక్కుతూ ఉన్న వీడియోను సమంత ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశారు. ‘నా లవ్‌స్టోరీ పేజీ నుంచీ.. మీకు ప్రేమతో’ అని ట్వీట్‌ చేశారు. ఈ వీడియోను చూసిన అమ్మడి ఫ్రెండ్స్, ఫ్యాన్స్ ఆమెను శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఈ వీడియోకు సోషల్ మీడియాలో లైక్స్, షేర్లు పడుతున్నాయి. ఎంగేజ్ మెంట్ నేపథ్యంలోనే సమ్మూ ఈ వీడియోను అప్ లోడ్ చేసిందని ప్రచారం జరుగుతోంది.

సమ్మూ- చైతూ ఎంగేజ్ మెంట్ పై ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ … ఆదివారం నిశ్చితార్థం జరగబోతోందని టాక్. ఆదిశగా ఏర్పాట్లన్నీ జోరుగా సాగుతున్నాయట. అతిరథ మహారథులందరూ ఈ వేడుకకు తరలిరానున్నారని సమాచారం. అఖిల్ ఎంగేజ్ మెంట్ కంటే గ్రాండ్ గా చైతూ నిశ్చితార్థం జరగనుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

 

Leave a Reply