Friday, December 9, 2022
HomeEntertainmentCinema Latestచైతు, సమంత పెళ్లి ముహూర్తం ఇదే.

చైతు, సమంత పెళ్లి ముహూర్తం ఇదే.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రేమికులు గా తెలుగు ప్రేక్షకులకి తెలిసిపోయిన నాగచైతన్య, సమంత ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారా అని ఎప్పటినుంచో ఆసక్తి రేపుతున్న ప్రశ్న. ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్న ఈ జంట ఇప్పుడు అప్పుడు అంటూ పెళ్లి వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఎట్టకేలకు తమ పెళ్లి ముహుర్తాన్ని నాగచైతన్య అధికారికం గా చెప్పేసారు. అక్టోబర్ 6 న తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు జియో ఫిలిం ఫేర్ అవార్డ్స్ సౌత్ ప్రెస్ మీట్ లో చైతు ప్రకటించాడు.

అక్కినేని వారసుల్లో ముందుగా తమ్ముడు అఖిల్ పెళ్లి అవుతుంది అనుకున్నప్పటికీ కొన్ని ఇబ్బందులతో ఆ పెళ్లి ఆగిపోయిన విషయం తెలిసిందే. అలా కాస్త డల్ అయిన అక్కినేని ఇంట్లో చైతు, సమంతల పెళ్లితో కొత్త ఉత్సాహం రానుంది.

- Advertisment -
spot_img

Most Popular