‘ఎస్’ థియరీ ఎవరి కోసం చైతూ ?

Posted October 8, 2016

   naga chaitanya use premam movie s letter word samantha

చైతూ ‘ప్రేమమ్’లో ‘ఎస్’ థియరీ బాగా వర్కవుట్ అయ్యింది. సినిమా చూసిన జనాలు ఈ ‘ఎస్’ భలేగుందే అనుకుంటున్నారు. ఈ ‘ఎస్’ థియరీని కావాలనే చైతూ పెట్టించాడనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. ?

‘ప్రేమమ్’ సినిమాలో ఒకట్రెండు చోట్ల ‘ఎస్’ థియరీ పై హీరో ఆన్సర్ చేస్తాడు. తనకు కాబోయే భార్య పేరు ‘ఎస్’ అనే అక్షరంతో మొదలవుతుందని చిన్నప్పుడు ఎవరో జ్యోతిష్యుడు చెప్పాడని.. అందుకే ‘ఎస్’ అనే అక్షరంతో మొదలైన ‘సుమ’ అనే అమ్మాయికి లైన్ వేస్తున్నా అంటాడు హీరో.

అతని జీవితంలోకి వచ్చిన మరో హీరోయిన్ పేరు ‘సితార’. అంతేకాదు.. హీరో పెట్టే బిజినెస్ కూడా ‘ఎస్’ తో మొద‌ల‌వుతుంది. అది ఎవరిని ఉద్దేశించి పెట్టావ్ అని అతని మూడో లవర్ సింధు అడిగితే.. చిన్నప్పుడు జ్యోతిష్యుడు చెప్పాడు.. అందుకే పెట్టా అంటాడు హీరో చైతూ. ఇలా ప్రేమమ్ లో అపుడప్పుడు ‘ఎస్’పై ప్రేమ ఉందని చెప్పే ప్రయత్నం చేశాడు చైతూ.

అయితే, ఇకడ ‘ఎస్’ ఫర్ సమంత అట. ఆమె పై ఉన్న ప్రేమని తన సినిమాలోనూ చూపించాలనే ‘ఎస్’ పెట్టించాడట చైతూ. అందుకే ఈ సినిమా చూసిన సమంత నేలపై నిలబడలేకపోతుందట. ప్రేమమ్ తో చైతూ హిట్ తో పాటుగా ప్రేమ కూడా ఇచ్చాడని సన్నిహితుల దగ్గర తెగ మురిసిపోతుందట. ఇందండీ ‘ఎస్’ థియరీ వెనక ఉన్న లాజిక్కు.

SHARE