నాగ‌శౌర్య‌ కాస్లీ షికారు.. సంగతేంటి ?

 Posted October 29, 2016

naga shourya buys a new benz car‘ఊహగలు గుసగుసలాడే’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగ‌శౌర్య‌.ఆ తర్వాత దిక్కులు చూడకు రామయ్య,కళ్యాణ్ వైభోగమే,ఒక మనసు..చిత్రాలు చేశాడు. ఈమధ్యే ‘జ్యో అచ్యుతానంద’ హిట్ కొట్టాడు.ఈ సినిమాతో నటుడుగా నాగ‌శౌర్య‌ మరింత పరిణితి చెందాడన్న విషయం అర్థమైంది.ఇప్పుడు స్టార్ దర్శకులు కూడా నాగ‌శౌర్య‌ కోసం చూస్తున్నారు.కుదిరితే నాగ‌శౌర్య‌  హీరోగా ఓ చిన్ని సినిమాని తీయాలని ప్లాన్ చేస్తున్నారు.ఈ లిస్టులో త్రివిక్రమ్,పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు  ఉండటం విశేషం.

ఈ విషయం కాసేపు ప్రక్కన పెడితే..కుర్ర హీరో నాగ‌శౌర్య‌కి కాస్లీ కారులో షికారు చేయాలని కోరిక బలంగా ఉండేదట.తాజాగా ఆ కోరికని తీర్చుకొన్నాడు.ఈరోజు (శనివారం) తన తల్లిదండ్రులతో కలిసి బ్లాక్ కలర్ బెంజ్ కారును కొనుగోలు చేశాడు.ఇన్నాళ్లు చేసిన సినిమా డబ్బులని వెనకేసుకొని మరీ.ఈ కారు కొన్నాడంట . కోటి రూపాయల విలువగల బెంజ్ జి క్లాస్ ఎస్ యు వి కారు తన సొంతం కావడంతో నాగశౌర్య ఆనందానికి అవధులు లేవు. మనోడు ఇప్పుడు కాస్లీ షికారు చేస్తున్నాడన్న మాట.

SHARE