“అమ్మమ్మ గారి ఇంట్లో” నాగ శౌర్య

0
551
naga-shourya-new-movie-title-ammamma-gari-intlo

 

naga-shourya-new-movie-title-ammamma-gari-intlo

ఊహలు గుసగుసలాడే చిత్రంతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు యంగ్ హీరో నాగ శౌర్య. ఆ తర్వాత వచ్చిన దిక్కులు చూడకు రామయ్య, కళ్యాణ వైభోగమే, జ్యో అచ్యుతానంద సినిమాలతో తన రేంజ్ ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈ సినిమా టైటిల్స్ ని, కధల్ని పరిశీలిస్తే.. ప్రస్తుతం వస్తున్న సినిమాలకీ, నాగ శౌర్య సినిమాలకీ చాలా తేడా ఉంది అన్న విషయం స్పష్టమతువుంది.  చాలా డిఫరెంట్ గా ఉండే కధలను, టైటిల్స్ ని ఎంచుకునే శౌర్య తాజాగా మరో కధకు ఓకే చెప్పాడని అతని సన్నిహితులు చెబుతున్నారు.

ఈ సినిమాకు అమ్మమ్మగారి ఇల్లు  అనే టైటిల్ ని కూడా ఫిక్స్  చేశాడట. ఈ సినిమాను అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడని ఫిలింనగర్ వర్గాలు చర్చించుకున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తోందని,  త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద వంటి హిట్ సినిమాలు వీరి కాంబినేషన్లో వచ్చినవే. మరి  ఈ సారి అమ్మమ్మగారి ఇల్లుతో ఎలాంటి హిట్ ని అందుకుంటారో చూడాలి.

Leave a Reply