నిర్మాతగా మారనున్న మరో యంగ్ హీరో

0
248
naga shourya turns to as producer

Posted [relativedate]

naga shourya turns to as producerఇప్పటి హీరోలు కేవలం తెర మీద హీరోలుగా నటించడం మాత్రమే కాకుండా  సినిమాకు సంబంధించిన వేరే డిపార్ట్ మెంటుల్లోకి  కూడా దూరిపోతున్నారు. అక్కడ కూడా తమకు తిరుగులేదని నిరూపించుకుంటున్నారు.

అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్ కాటమరాయుడా అనే పాట పాడి,  తమ పాటను తామే పాడుకునే ట్రెండ్ ను ఇప్పటి జనరేషన్ కి సెట్ చేశాడు. ఇక ఈ ట్రెండ్ నే ఫాలో అవుతూ  ఎన్టీఆర్..   నాన్నకు ప్రేమతో, రవితేజ.. కిక్ లో, బన్నీ.. సరైనోడులో తమ పాటల్ని తామే పాడుకున్నారు.

ఇక మరికొందరు హీరోలైతే నిర్మాతలుగా మారి తమ సినిమాలను మాత్రమే కాకుండా వేరే హీరోల సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్.. తన సినిమాలను తాను నిర్మించుకోవడమే కాకుండా ఎన్టీఆర్ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అలాగే నితిన్.. అక్కినేని అఖిల్ నటించిన అఖిల్ సినిమాకు నిర్మాతగా మారాడు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్… నితిన్ హీరోగ ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇలా హీరోలందరూ వేరే హీరోల సినిమాలకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజగా ఇదే జాబితాలోకి చేరిపోయాడు యంగ్ హీరో నాగశౌర్య.  

ఊహ‌లు గుస‌గుస‌లాడేతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ‌శౌర్య‌కు రీసెంట్‌గా విడుద‌లైన జో అచ్యుతానంద సినిమా ప్ర‌శంసలను  తెచ్చిపెట్టినా, క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ కాక‌లేకపోయాడు. దీంతో అవకాశాలు కూడా సన్న‌గిల్లాయి. దీంతో ఈ యంగ్ హీరో కన్ను నిర్మాణంపై పడింది.

వెంకీ కుడుముల అనే నూతన దర్శకుడ్ని పరిచయం చేస్తూ  నాగ‌శౌర్య ఓ సినిమాను  రూపొందించ‌డానికి సన్నాహాలు చేస్తున్నాడట‌. రొమాంటిక్ ఎంట‌ర్‌ టైన‌ర్ క‌థాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సినీ విశ్లేషకులు  నిర్మాత‌గా మార‌డం అంటే చిన్న విష‌యం కాదని, నాగ‌శౌర్య ధైర్యానికి మెచ్చుకోవాల్సిందేనని అంటున్నారు. మరి నాగశౌర్య నిర్మాతగా ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.

Leave a Reply