బీజేపీ వైపు నాగ‌బాబు చూపు?

0
374
nagababu join hands with bjp

Posted [relativedate]

nagababu join hands with bjp
మెగా స్టార్ చిరంజీవి కుటుంబంలో మూడు ముక్క‌లాట మొద‌ల‌వ్వ‌నుందా? మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూడా త్వ‌ర‌లో పాలిటిక్స్ లో చేర‌బోతున్నారా? ఆయ‌న బీజేపీ వైపు చూస్తున్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇక ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు. ఇక మెగా బ్ర‌ద‌ర్స్ లో మిగిలింది నాగ‌బాబు ఒక్క‌రే. ఆయ‌న కూడా ఇక పాలిటిక్స్ చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ లా… నాగ‌బాబుకు రాజ‌కీయాల‌పై త‌న కంటూ కొన్నినిర్దిష్ట‌మైన అభిప్రాయాలున్నాయి. అప్ప‌ట్లో ప్ర‌జారాజ్యం ఆవిర్భావ స‌మ‌యంలో ఈయ‌నే కీల‌క‌పాత్ర పోషించారు. ఆ త‌ర్వాత పార్టీకి దూర‌మైనా.. రాజ‌కీయాల‌ను మాత్రం ఆయ‌న ఫాలో అవుతూనే ఉంటారు. ప్రజా స‌మ‌స్య‌ల‌పైనా ఆయ‌న అవ‌గాహ‌న ఉంది. స్పందించే గుణం కూడా ఉంది. ఈ మ‌ధ్య నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంపై ప్ర‌ధాని మోడీ నిర్ణ‌యాన్ని ఆయ‌న స‌మ‌ర్థించారు. చిరు, ప‌వ‌న్ కు సంబంధం లేకుండా వ్య‌క్తిగ‌తంగా ఇది త‌న అభిప్రాయ‌మంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. మోడీని ఆకాశానికెత్తేశారు. దీంతో అప్ప‌ట్నుంచి ఆయ‌న బీజేపీ వైపు చూస్తున్నార‌న్న ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.

ప్ర‌స్తుతానికి నాగ‌బాబు జ‌బ‌ర్ద‌స్త్ షోతో బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికిప్పుడు ఆయ‌న రాజ‌కీయాల్లో చేర‌క‌పోయినా… బీజేపీలోకి ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని టాక్. ఈ దిశ‌గా బీజేపీ పెద్ద‌ల‌తోనూ సంప్ర‌దింపులు జ‌రిగాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటు చిరు-ప‌వ‌న్ కు కూడా ఆయ‌న విష‌యాన్ని చెప్పార‌ట‌. వారిద్ద‌రూ కూడా నాగ‌బాబు ఇష్టానికే వ‌దిలేశార‌ట‌. దీంతో ఇక అన్నీ కుదిరితే 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున మెగా బ‌ద్ర‌ర్ ఎంపీగా పోటీ చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఇందుకోసం ఒక నియోజ‌క‌వ‌ర్గాన్ని కూడా ఆయ‌న ఎంచుకున్నార‌ట‌. అంటే ఇక మెగా కుటుంబంలో మూడు ముక్క‌లాట జ‌ర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.!!

Leave a Reply