నాగబాబు కొత్త బిజినెస్‌.. హీరోల బ్రోకర్‌!!

0
156
Nagababu new business to fix heros dates

Posted [relativedate]

Nagababu new business to fix heros dates
మెగా బ్రదర్‌ నాగబాబు అంజనా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో పలు చిత్రాలు నిర్మించాడు. ‘ఆరంజ్‌’ చిత్రం ఆయనకు భారీ నష్టాలను తెచ్చి పెట్టడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. దాంతో అప్పటి నుండి కూడా సినిమాల నిర్మాణం వైపు అడుగులు వేయడం లేదు. ఎందరు మద్దతుగా నిలుస్తామని చెప్పినా కూడా నాగబాబు మాత్రం నిర్మాణం వైపుకు మొగ్గడం లేదు. బుల్లి తెరపై కార్యక్రమాలు చేస్తూ వస్తున్న నాగబాబు ప్రస్తుతం కొత్త బిజినెస్‌ను ప్లాన్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

తనకున్న పరిచయాలతో హీరోల డేట్స్‌ను బ్లాక్‌ చేసుకుని, ఆ డేట్లను అవసరం ఉన్న నిర్మాతలకు ఎక్కువ రేటుకు అమ్మే బిజినెస్‌ను నాగబాబు చేస్తున్నాడు. తాజాగా డీజే చిత్రంలో నటిస్తున్న అల్లు అర్జున్‌ తర్వాత చిత్ర డేట్లను నాగబాబు దక్కించుకున్నాడు. డీజే చిత్రం పూర్తి అయిన తర్వాత ఒక ప్రముఖ నిర్మాత అల్లు అర్జున్‌తో సినిమా తీసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. దాంతో నాగబాబు వద్ద ఉన్న డేట్లను ఆ నిర్మాత కొనుగోలు చేయనున్నాడు. అలా నాగబాబుకు భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. నాగబాబు మొదలు పెట్టిన ఈ బిజినెస్‌ బాలీవుడ్‌లో ఇప్పటికే జరుగుతూ ఉంది. ఇందులో అయినా నాగబాబు మంచి లాభాలు దక్కించుకుంటాడేమో చూడాలి.

Leave a Reply