చరణ్ నిర్మాతకి బన్నీ లిఫ్ట్?

0
644
nagababu producer to allu arjun naa peru surya naa illu india movie

Posted [relativedate]

nagababu producer to allu arjun naa peru surya naa illu india movie
చరణ్ తో ఆరంజ్ తీసాక నాగబాబు ఓ నిర్మాతగా ఆగిపోయాడు.ఆ సినిమా ఫలితం అంతకన్నా ముందే దగ్గరివాళ్ళు చేసిన మోసం తో అంజనా ప్రొడక్షన్స్ సినిమాలకి దూరమైంది. ఆరంజ్ కారణం అయినా కాకపోయినా నాగబాబు ఆ సినిమా తర్వాత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఓ దశలో ఆత్మహత్య ఆలోచన కూడా చేసారంట.అయితే అదంతా గతం.తర్వాత జబర్దస్త్ లో జడ్జి గా,సీరియల్స్ లో నటుడిగా,ఓ యంగ్ హీరో తండ్రిగా సరి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. అయితే అంజనా ప్రొడక్షన్స్ లో మళ్లీ సినిమా తీసే పరిస్థితిలో వున్నాడా అంటే ఎస్ అని చెప్పలేని పరిస్థితి. అయితే ఆ సంస్థ మళ్లీ చిత్రరంగంలోకి వచ్చేలా బన్నీ లిఫ్ట్ ఇస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్.

వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేస్తున్నాడు.ఆ సినిమా పేరు “నా పేరు సూర్య ..నా ఇల్లు ఇండియా “. ఈ సినిమాకి లగడపాటి శ్రీధర్,బన్నీ వాసు తో పాటు నాగబాబు కూడా నిర్మాతగా ఉండేలా బన్నీ ప్లాన్ చేస్తున్నారట.ఇదే నిజమైతే అంజనా ప్రొడక్షన్స్ పుంజుకుంటే పరిశ్రమకి ఓ మంచి ప్రొడ్యూసర్ దొరికినట్టే.రుద్రవీణ లాంటి కళాత్మక చిత్రాలు,బావగారు బాగున్నారా వంటి కమర్షియల్ చిత్రాలు చేసిన నాగబాబు సెకండ్ ఇన్నింగ్స్ లో అదిరిపోయే సినిమాలు తీస్తాడని ఆశిద్దాం.

Leave a Reply