మెగా ఫ్యామిలీని కలుపుతున్న స్టేటస్ ..

0
507

Posted [relativedate]

nagababu support pawan kalyan to silent protest at RK Beach for ap special status ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగా ఫ్యామిలీ హీరోలంతా కనిపించారు ..ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తప్ప.ఇక ఆ ఫ్యామిలీ లో ఆయన ఒంటరి అయిపోయినట్టే అనిపించింది.చిరు తరపున ఎంతమంది ప్రయత్నించినా పవన్ ఆ ఫంక్షన్ కి రాకపోవడంతో ఆ అభిప్రాయం బలపడింది.అయితే ఇలా అనుకునేవాళ్ళకి కొణిదెల కుటుంబం పెద్ద షాక్ ఇచ్చింది.విశాఖ వేదికగా ఆంధ్రాకి ప్రత్యేక హోదా డిమాండ్ తో యువత తలపెట్టిన మౌన నిరసనకు పవన్ మద్దతిచ్చారు.ఆ నిరసన కార్యక్రమాన్ని ముందుండి నడిపేందుకు డిసైడ్ అయ్యారు.దీంతో ఒక్కసారిగా మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కి అనూహ్యమైన సపోర్ట్ దొరికింది.

మెగా క్యాంపు లో యువ హీరోలు వరుణ్ తేజ్,సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే పవన్ కి మద్దతుగా గొంతు విప్పారు.ఇప్పుడు సాక్షాత్తు మెగా బ్రదర్ నాగ బాబు హోదా అంశంలో పవన్ కి అండగా ట్వీట్ చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.జనసేన అధినేత పవన్ కి సంఘీభావంగా ఉంటాం.మన భవిష్యత్ కోసం ఈ పని చేయాల్సిందే అని ఆ ట్వీట్ లో నాగబాబు అభిప్రాయపడ్డారు.ఒకప్పుడు మెగా ఫంక్షన్స్ లో గొడవ చేస్తున్నారని పవన్ ఫాన్స్ మీద విరుచుకుపడ్డ నాగబాబు …. ఇటీవల పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోడీ ధైర్యాన్ని ప్రశంసించిన నాగ బాబు …ఇప్పుడు పవన్ కి ఈ విధంగా మద్దతు ఇవ్వడం చూస్తుంటే ఏపీ కి స్పెషల్ స్టేటస్ అంశం మెగా ఫ్యామిలీని మళ్లీ కలుపుతున్నట్టు అనిపించడం లేదూ!

Leave a Reply