Posted [relativedate]
కొణిదెల నీహారిక …మెగా ఫ్యామిలీ నుంచి బుల్లితెరకు ..ఆపై వెండితెరకి పరిచయమైన తొలి అమ్మాయి.నార్త్ లో ఎలా వున్నా దక్షిణాది సినీ పరిశ్రమలో వారసత్వం అబ్బాయిలకు తప్ప అమ్మాయిలకి కాదని ఓ బలమైన నమ్మకముంది.ముందుగా కమలహాసన్ కూతురు శృతి హాసన్ దాన్ని బ్రేక్ చేస్తే తెలుగులో నాగబాబు కుమార్తె నీహారిక హీరోయిన్ గా వెండితెరపైకి వచ్చింది.ఒక మనసు సినిమా ఆమెని హీరోయిన్ గా పరిచయం చేసిందే తప్ప విజయాన్ని అందించలేకపోయింది. ఆ సినిమా అపజయంతో నీహారిక సైలెంట్ అయిపోతుందని ఓ టాక్ వచ్చింది.ఆమె ప్రధాన పాత్రలో నాన్న కూచి తీస్తున్నారని తెలియగానే అది వెబ్ సిరీస్ అనుకున్నారు.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అది సినిమానే అని తెలుస్తోంది.
నీహారిక,నాగబాబు ప్రధానపాత్రలు పోషిస్తున్న నాన్న కూచి ఫస్ట్ లుక్ బయటికి వచ్చాక మాత్రమే అది సినిమానే అని తెలిసింది.నాగబాబు,నీహారిక ఇందులో తండ్రీకూతురు పాత్రలు పోషిస్తున్నారు. కావాలనే ఈ సినిమా గురించి లో ప్రొఫైల్ మెయింటైన్ చేసినట్టు సమాచారం.ఈసారి నీహారిక ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిద్దాం.