నాగాభరణం మూవీ రివ్యూ…

Posted October 14, 2016

nagabharanam movie review

చిత్రం : నాగాభరణం (2016)
నటీనటులు : రమ్య, దిగంత్, విష్ణు వర్ధన్
సంగీతం : గురు కిరణ్
దర్శకత్వం : కోడి రామకృష్ణ
నిర్మాత : సాజిత్ ఖురేషీ, సోహేల్ అన్సారి, ధవల్ గడ
రిలీజ్ డేట్ : 14 అక్టోబర్, 2016.

దర్శకుడు కోడి రామకృష్ణకది.. ప్రత్యేకమైన శైలి. వంద చిత్రాలకిపైగా దర్శకత్వ బాధ్యతలని నిర్వహించిన కోడీ.. విజువండర్స్ చిత్రాలు అమ్మోరు, దేవి, అరుంధతి.. లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకొన్నారు. తాజాగా, ఆయన నుంచి వస్తోన్న మరో విజువల్ వండర్ ‘నాగభరణం’. కన్నడలో ‘నాగరహవు’ చిత్రాన్ని తెలుగులో  ‘నాగభరణం’గా తీసుకొచ్చారు కోడీ. ఈ విజువల్ వండర్ ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి.. కోడీకి అచ్చొచ్చిన విజువల్ వండర్ మరోసారి హిట్ నిచ్చిందా.. ?  కోడి ‘నాగాభరణం’ ప్రేక్షకులని ఏ మేరకు మెప్పించింది.. ?? అసలు నాగాభరణం కథేంటో.. ? తెలుసుకునేందుకు రివ్యూలోకి  వెళదాం పదండీ..

కథ :
ఓ శక్తి కవచం చుట్టూ అల్లిన కథ ఇది. సూర్య గ్రహణం రోజున దేవతల శక్తులన్నీ నశిస్తాయి. ఆ రోజున దుష్ట శక్తుల నుంచి భూగోళాన్ని ఆ శక్తి కవచం కాపాడుతూ ఉంటుంది. అంతటి శక్తిగల శక్తి కవచాన్ని శివయ్య (సాయి కుమార్ వంశం) ఎన్నో యేళ్లుగా కాపాడుతూ వస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే శివయ్య కూతురు నాగమ్మ (రమ్య) శక్తి కవచాన్ని కాపాడే సమయంలో ప్రాణాలు కోల్పోతోంది. శక్తి కవచాన్ని కాపాడటం కోసం మరో జన్మని ఎత్తిన నాగమ్మ.. మానస (రమ్య) ఎలాంటి పోరాటలు చేసింది. చివరకి శక్తి కవచాని ఎలా కాపాడింది.. ?? ఈ మధ్య శక్తి కవచం ఎవరెవరి చేతులు మారింది.. ?? కథలో విష్ణువర్థన్ ఎవరు.. ??? అన్నది మిగితా కథ.

 ప్లస్ పాయింట్స్ :
* గ్రాఫిక్స్
* రమ్య
* విష్ణువర్థన్ విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా చూపడం

మైనస్ పాయింట్స్ :
* ముందే ఊహించే గల కథ.
* విలన్ పాత్ర
* పాత్రల ఓవర్ యాక్షన్

నటీనటుల ఫర్ ఫామెన్స్ :
బలమైన కథకి విజువల్ ఎఫెక్ట్స్‌తో మాయ చేస్తే ప్రేక్షకులు సీట్లకి అతుక్కుపోయి చూడటం ఖాయం. దర్శకుడు కోడి రామకృష్ణ అమ్మోరు, దేవీ, అరుంధతి సినిమాల విషయంలో అదే చేశారు. అందుకే ఆ చిత్రాలు బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలిచాయి. అయితే, ‘నాగాభరణం’లో కోడి లెక్క తప్పాడు. ఎప్పటిలాగే విజువల్ ఎఫెక్ట్స్‌తో మాయ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. బలమైన కథని అల్లుకోవడంలో ఫేలయ్యారు. దీంతో.. విజువల్ ఎఫెక్ట్స్‌తో ఎంత మాయ చేసిన ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వలేకపోయాడు. ఎమోషన్స్  పండించడంలోనూ కోడి మార్క్ కనబడలేదు. లీడ్ రోల్ పోషించిన రమ్య తన నటనతో ఆకట్టుకొంది. క్లైమాక్స్‌లో చనిపోయిన సూపర్ స్టార్‌ విష్ణు వర్ధన్ ను విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా ఆవిష్కరించడం ఆకట్టుకొంది. విలన్ పాత్ర మరి నాసిరకంగా ఉంది. మిగితా నటీనటుల గురించి మాట్లాడుకోవడం వ్యర్థం. పాత్రలన్నీ అతి చేసినట్టు అనిపిస్తుంటుంది.

సాంకేతికంగా :
ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానబలంగా చెప్పవచ్చు. అయితే, బలమైన కథ లేకపోవడం కారణంగా గ్రాఫిక్స్ ప్రేక్షకుడిని థ్రిల్ చేయలేకపోయాయి. ఫస్ట్ కంటే.. సెకాండాఫ్ కాస్త బెటర్ గా అనిపించింది. సినిమాలో పాటులు అసలు బాగోలేవు. అయితే, నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకొంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. బోరింగ్ సన్నివేశాలు చాలా ఉన్నాయి. సినిమాకి చాలా చోట్ల కత్తెర పెట్టొచ్చు.

తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
కోడి రామకృష్ణ సినిమా వస్తుందంటే.. ఫ్యామిలీ ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేవారు. అమ్మోరు, దేవీ, అరుంధతి చిత్రాలకి గ్రామీణ ప్రాంతాల్లోనూ బాగా ఆడాయి. అయితే, ‘నాగాభరణం’ మాత్రం ఆ రేంజ్ లో లేదు. విజువల్ వండర్స్ ని చూసి తరించే ప్రేక్షకులకి నాగాభరణం ఓ మోస్తరుగా
నచ్చవచ్చు.

చివరగా : ‘నాగాభరణం’.. కోడి మార్క్ మిస్సయ్యింది.
రేటింగ్ : 2.5/5

SHARE