చైతూ షాకింగ్ డిసిషన్….

 Posted October 17, 2016

nagachaitanya acting sreenu vaitla movie

‘ప్రేమమ్’తో ఫస్ట్ టైం నటుడిగా పూర్తి స్థాయి మార్కులు కొట్టేశాడు నాగ చైతన్య. ప్రేమమ్ రిజల్ట్ తో పాటుగా.. అందులో నాగ చైతన్య నటన పట్ల అక్కినేని ఫ్యామిలీ సంతృప్తికరంగా ఉంది. ఇక, చైతూ హిట్ ట్రాక్ లో పడిపోయినట్టే అనుకున్నారంతా. ఇకమీదట ఒకట్రెండు వరుస హిట్స్ దక్కితే.. స్టార్ హీరో రేంజ్ కి చైతూ చేరుకుంటాడని లెక్కలేసుకొన్నారు. అయితే, చైతూ మాత్రం షాకింగ్ డిసిషన్ తో.. ప్రేక్షకులకి, సినీ ప్రముఖులకి షాకిచ్చాడు.

‘ప్రేమమ్’తో హిట్ కొట్టిన చైతూ.. ప్లాప్ డైరెక్టర్ శ్రీనువైట్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఇప్పటికే నాగచైతన్య, నాగార్జునలకు కథ వినిపించి ఓకె కూడా చేయించుకున్నాడట వైట్ల. ప్రస్తుతం మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ ‘మిస్టర్’తో బిజీగా ఉన్నాడు శ్రీనువైట్ల. ఈ చిత్రం తర్వాత చైతూ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. చైతూ శ్రీను వైట్లని ఎంచుకోవడం షాకింగ్ న్యూసే. అయితే, ఈ డిసిషన్ నాగ్ తో కలసి తీసుకొన్నాడు కాబట్టి శ్రీను వైట్ల కథలో బలం ఉందేమోనని చెప్పుకొంటున్నారు.

SHARE