10డేస్ ‘ప్రేమమ్’ కలెక్షన్స్…..

 Posted October 19, 2016

nagachaitanya premam movie collectionsదసరా కనుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 5చిత్రాల్లో నాగచైతన్య ‘ప్రేమమ్’ ది బెస్ట్ చిత్రంగా నిలిచింది. యూత్ తో పాటుగా ఫ్యామిలీ ప్రేక్షకులు ‘ప్రేమమ్’కి బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో.. కలెక్షన్స్ పరంగా ప్రేమమ్ దూసుకెళ్తోంది. ఈ సినిమాకి కేవ‌లం 10 రోజుల్లోనే 20 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. చైతూ కెరియ‌ర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ప్రేమమ్. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమమ్’లో చైతూ నటనకి ఫుల్ మార్కులు పడటంతో అక్కినేని ఫ్యామిలీతో పాటుగా, ప్రేయసి సమంత సంతోషంతో ఉన్నారు.

ఇక, ఏరియాల వారీగా ప్రేమమ్ కలెక్షన్స్ ని చూస్తే :
* నైజాం – 5.30 కోట్ల
* సీడెడ్ – 2.32 కోట్లు
* ఓవర్సీస్ – 2.53 కోట్లు
* వైజాగ్ – 1.97 కోట్లు
* తూర్పు గోదావరి – 1.11 కోట్లు
* వెస్ట్ – 81 లక్షలు
* కృష్ణా – 1.21 కోట్లు
* గుంటూరు – 1.40 కోట్లు
* నెల్లూరు – 62 లక్షల
*కర్నాటక – 1.85 కోట్లు

SHARE