“నగరం” రివ్యూ

0
433
nagaram movie review

Posted [relativedate]

nagaram movie reviewచిత్రం: న‌గ‌రం

తారాగణం: సందీప్ కిష‌న్‌, రెజీనా, శ్రీ, చార్లీ, మ‌ధుసూద‌న్
సంగీతం: జావేద్ రియాజ్‌
ఛాయాగ్రహణం: సెల్వ‌కుమార్ ఎస్‌.కె

మాట‌లు: శ‌శాంక్ వెన్నెల‌కంటి
సంస్ధ: ఎకెఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, పొటెన్షియల్‌ స్టూడియోస్‌
నిర్మాత: అశ్వ‌నికుమార్ స‌హ‌దేవ్‌
ద‌ర్శ‌క‌త్వం: లోకేష్ క‌న‌గరాజ్‌

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తర్వాత సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు  సందీప్ కిషన్. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న తపనతో సందీప్..  నగరం సినిమాలో నటించాడు. నిజానికి ఈ సినిమా మానగరం పేరుతో తమిళ్ లో తెరకెక్కింది. దీన్నే తెలుగులో నగరం పేరుతో   రిలీజ్ చేశారు. లోకేష్ క‌న‌గరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ క్రైం,  థ్రిల్లర్ తో మరి సందీప్ కిషన్  హిట్ కొట్టాడో లేదో తెలుగు బుల్లెట్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.   

కధ ఏంటంటే:

శ్రీ అనే కుర్రాడు పల్లెటూరి నుంచి పట్నానికి ఉద్యోగం కోసం వస్తాడు. ఓ సాఫ్ట్‌ వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. రెజీనా ఆ కంపనీలో హెచ్ఆర్‌గా పనిచేస్తుంటుంది. మరో పక్క ఆమెను  సందీప్ కిషన్ ప్రేమిస్తున్నానంటూ ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. సందీప్ కిషన్ ఆకతాయిగా తిరుగుతుండం  రెజీనాకు నచ్చదు. దీంతో సందీప్ అంటే ఇష్టం ఉన్నా  ఆమె అతని ప్రేమను ఒప్పుకోదు. మరోపక్క త‌న కొడుకు వైద్యం కోసం సిటీకి వ‌స్తాడు చార్లి.  ఇతను ఓ ఏరియాకి డాన్ అయిన పీకేపీ వద్ద కార్ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. ఆ నగరంలో ఉన్న కొందరు గూండాలు ఒక బాబుని కిడ్నాప్ చేయబోయి పీకేపీ కిడ్నాప్ చేస్తారు.  అనుకోకుండా సందీప్ ఈ కిడ్నాప్ కేసులో ఇరుక్కుంటాడు. సందీప్ కి ఆ కార్ డ్రైవర్ సాయం చేస్తాడు. ఈ  ప్రమాదం నుండి హీరో ఎలా బయట పడతాడు ? తన ప్రేమను ఎలా దక్కించుకుంటాడు ? శ్రీ పరిస్థితి  ఏమవుతుంది ? ఇలాంటి ఆసక్తికర విషయాలను  తెలుసుకోవాలనుంటే సినిమాను వెండితెరమీద  చూడాల్సిందే.

కధనం ఏంటంటే…

ఓ నగరంలో 48 గంటల వ్యవధిలో కొందరి జీవితాల్లో చోటుచేసుకొన్న సంఘటనలే నగరం సినిమా. రెజీనా ప్రేమ కోసం తపించే పాత్రలో సందీప్ కిషన్,  ప్రేమను కాపాడుకొనేందుకు పట్టణానికి వచ్చి ఇబ్బందుల్లో పడ్డ శ్రీ, ఆర్థికంగా కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడానికి డ్రైవర్ అవతారం ఎత్తిన చార్లే,  నగరంలో మాఫియా డాన్ మధుసూదన్ కుమారుడిని కిడ్నాప్ చేసిన ఓ ముఠా, ఓ అవినీతి పోలీస్ ఆఫీసర్… ఇలాంటి పాత్రల మధ్య జరిగిన సంఘటనల సమాహారమే నగరం. సినిమా మొదటి భాగం మొత్తం ట్విస్ట్ లతోటి , నాలుగు పాత్రలతోటి, కిడ్నాప్ డ్రామా తోటి నడుస్తుంది. సినిమా రెండవ భాగం మాత్రం ఫుల్ లెన్త్ థ్రిల్లింగ్ అని చెప్పాలి. సినిమా మొత్తం సీరియస్ గా నడుస్తున్నప్పటికీ అక్కడక్కడా సరైన టైంలో  కామెడీ పడింది.

 ఎవరు ఎలా చేశారంటే…

హీరో ఇమేజ్‌ను వ‌దిలేసి సందీప్ కిషన్ క‌థ‌లోని పాత్ర‌లో ఒదిగిపోయాడు. రెజీనా పాత్ర చిన్నదే అయినా.. ఉన్నంతలో ఆకట్టుకుంది.  శ్రీ  నటన హైలైట్ గా చెప్పుకోవచ్చు. అమాయకుడైన క్యాబ్ డ్రైవర్‌ గా చార్లే బాగా నటించాడు. దర్శకుడు లోకేశ్ కనగరాజ్  చేసిన తొలి ప్రయత్నం అద్భుతమని చెప్పాలి.  అనేక ట్విస్టులు, సస్పెన్స్‌, హ్యూమర్, ఎమోషన్స్, థ్రిల్స్‌ ను తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. జావేద్ అందించిన మ్యూజిక్ అండ్  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయింది. తన సౌండ్స్‌ తో, సైలెన్స్‌ తో సినిమా స్థాయిని పెంచాడు. సెల్వకుమార్ సినిమాటోగ్రఫీ కథకు తగ్గట్లుగా ఉంది.

ప్లస్ పాయింట్స్:

స్క్రీన్ ప్లే

దర్శకత్వం

నటీనటుల పెర్ఫామెన్స్

మైనస్ పాయింట్స్:

కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం

ఆఖరిపంచ్: క్రైం.. థ్రిల్లర్ ని ఇష్టపడే వారికి సందీప్ నగరం నచ్చుతుంది.

Telugu Bullet Rating: 2.5/5

Leave a Reply