బంగార్రాజు ఇంత మాటనేశాడేంటి?

0
449
nagarjuna about is next movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

nagarjuna about is next movie
నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం గత సంవత్సరం ఆయనకు భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను అందించిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో బంగార్రాజు పాత్రను అంతా కూడా అభిమానించారు. దాంతో ఆ పాత్రను బేస్‌ చేసుకుని అదే దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున ‘బంగార్రాజు’ సినిమాను చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయాన్ని దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ మరియు హీరో నాగార్జున కూడా దృవీకరించారు. అయితే ‘బంగార్రాజు’ కంటే ముందే నాగచైతన్యతో ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించాడు. ఈ వారంలో ఆ సినిమా విడుదల కాబోతుంది. ఆ సినిమా ఫలితాన్ని బట్టి బంగార్రాజు ఉండే అవకాశాలున్నట్లుగా అనిపిస్తుంది.

తాజాగా ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నిర్మాత అయిన నాగార్జున మాట్లాడుతూ ‘బంగార్రాజు’ సినిమా ఉంటుందా ఉండదా అనే అనుమానాలను రేకెత్తేలా వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం చేస్తున్న త్వరలో చేయబోతున్న ప్రాజెక్ట్‌ల గురించి మీడియా వారు నాగార్జునను అడిగిన సమయంలో ‘రాజుగారి గది 2’ చిత్రం మరో 10 రోజుల్లో పూర్తి అయ్యే అవకాశాలున్నాయి. ఆ తర్వాత ‘బంగార్రాజు’ కథపై కూర్చోవాలి. ఆ కథ సెట్‌ అయితేనే ‘బంగార్రాజు’ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమా కథతో లింక్‌ అయ్యి ఉండి ‘బంగార్రాజు’ కథ ఉండాల్సి ఉంది. అలా ఉంటేనే ప్రేక్షకుల్లో ఆసక్తి కలగుతుంది. అయితే అలా లింక్‌ అయ్యేలా కథను తయారు చేస్తే అది ఆకట్టుకుంటుందా అనేది అనుమానమే. అంటే కథ ఫైనల్‌ కావడం అంత సులభం ఏమీ కాదు. అదే నాగార్జున మాటల్లో అర్థం అవుతుంది. బంగార్రాజు ఉంటుందని పూర్తి నమ్మకంతో చెప్పలేమని నాగార్జున మాటల ద్వారా అర్థం అవుతుంది.

Leave a Reply