అంధ పాత్రలో నాగ్? నిర్మాత మోహన్ లాల్?

0
564

Posted [relativedate]

  nagarjuna acting blind man role mohanlal producer

వయసుకి తగ్గ పాత్రలు, ప్రయోగాలతో రెచ్చిపోతున్న టాలీవుడ్ మన్మధుడు నాగ్ మరో ఎక్స్ పెరిమెంట్ కి రెడీ అవుతున్నాడా? ఔననే తెలుస్తోంది. ఊపిరిలో శరీరం అంత చచ్చుబడిన పాత్ర చేసి ఆడియన్స్ ని మెప్పించిన నాగ్ దగ్గరకు ఈసారి అంధ పాత్ర ఆఫర్ వచ్చింది. ఇది ఒప్పకు అనే మలయాళ చిత్రం రీమేక్. అందులో కథానాయకుడిగా మోహన్ లాల్ చేశారు. నివాసం ఉండే అపార్ట్ మెంట్ లో జరిగిన ఓ హత్య కేసును అంధుడైన హీరో ఛేదించడం ఈ సినిమా కథాంశం. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం తెలుగు హక్కుల్ని ఓవర్సీస్ నెట్ వర్క్ సెంటర్ సంస్థ దక్కించుకొంది. మోహన్ లాల్, దిలీప్ కుమార్ నిర్మాతలు గా తెలుగు రీమేక్ చేయడానికి రంగం సిద్ధమైంది.

నాగ్ అయితే ఈ పాత్రకు సరిపోతాడని మోహన్ లాల్ భావిస్తున్నారట. అందుకే చిత్రబృందం తరపున నాగ్ కి ఆఫర్ వచ్చిందట. ఆయన ఈ సినిమాని ఓకే చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే తెలుగు సినిమాల్లో అగ్ర కథానాయకులు కూడా ప్రయోగాలు చేసే ట్రెండ్ ని ముందుకు తీసుకెళ్ళినట్టే.

Leave a Reply