మామకోడళ్లు  భయపడతారా…పెడతారా??

0
529
nagarjuna and samantha in omkar rajugari gadhi 2 movie

Posted [relativedate]

nagarjuna and samantha in omkar rajugari gadhi 2 movieటాలీవుడ్ మామకోడళ్లు.. ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది నాగార్జున.. సమంత. ఇప్పటివరకు తెలుగు సీనీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మామకోడళ్లు ఇద్దరూ కలిసి నటిస్తున్న సినిమా రాజుగారి గది-2. అక్కినేని ఇంటికి కాబోయే కోడలు సమంత, కింగ్ నాగార్జున కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాకి హైప్ క్రియేట్ అయ్యింది. అందునా ఈ సినిమా హారర్ సినిమా అవ్వడంతో ఆ హైప్ మరింత పెరిగింది.

నాగార్జున మెంటలిస్ట్ పాత్రలో నటిస్తుండగా సమంత దెయ్యంగా కన్పించనుందని చిత్రయూనిట్ చెబుతోంది. స‌మంత పాయింట్ ఆఫ్ వ్యూలోనే  క‌థ నేరేష‌న్ ఉండనుందట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఓంకార్ అంతే క్రేజీగా తెరకెక్కిస్తున్నాడు. కాగా త‌న‌కి హార‌ర్ సినిమాలంటే చాలా భ‌యమని, అందుకే ఆ సినిమాలు చూడడని  గ‌తంలో చాలా  సంద‌ర్భాల్లో నాగార్జున వెల్లడించాడు. అలానే సమంతకి కూడా హర్రర్ సినిమాలంటే భయమని, ఆమె చాలా సున్నిత మనస్కురాలని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.  అలాంటిది ఇప్పుడు వాళ్లే స్వయంగా హర్రర్ సినిమాల్లో నటిస్తున్నారు. మరి మామకోడళ్లు భయపడతారో లేక భయపెడతారో చూడాలి.  

Leave a Reply