నాగ్ – బాలయ్య కలవబోతున్నారు..?

0
448
nagarjuna balakrishna meets together in tsr awards function

Posted [relativedate]

nagarjuna balakrishna meets together in tsr awards functionటాలీవుడ్ లో అగ్రహీరోలకు పుట్టి స్టార్ హీరోలుగా ఎదిగిన వారు నాగార్జున-బాలకృష్ణ.. ఒకప్పుడు నాగ్ – బాలయ్య ఇండస్ట్రీ లో మంచి స్నేహితులు, కానీ కొన్ని కారణాలు వలన వీళ్ళిద్దరు కొంత కాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఈ ఇరువురిని కలపటానికి ఎంతోమంది ప్రయత్నించిన అవి ఫలించలేదు.

మళ్ళీ బాలకృష్ణ తో కలవటానికి,ఈ ఇష్యూను సెటిల్ చేసుకోవటానికి నాగ్ స్వయంగా ప్రయత్నించిన అవి ఫలించలేదు.. రోజు రోజుకి ఇరువురి మధ్య దూరం మాత్రం పెరుగుతుందే గానీ తగ్గలేదనే చెప్పాలి. వీళ్ళిద్దరూ కలవాలని టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తుంది.. ఎంత ట్రై చేసినా ఇక వీళ్ళిద్దరూ కలవరులే అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ వారి ఆలోచనలకు భిన్నంగా వీళ్ళిద్దరు ఒక కార్యక్రమంలో కలవబోతున్నారు..

రీసెంట్ గా సుబ్బిరామి రెడ్డి టీఎస్సార్ అవార్డుల గురించి ప్రకటించిన విషయం తెలిసిందే.టీఎస్సార్ అవార్డుల్లో భాగంగా బెస్ట్ యాక్టర్ కేటగిరి విభాగంలో నాగార్జున పేరును.. బెస్ట్ హీరో కేటగిరీలో బాలకృష్ణ పేరును ప్రకటించారు. టీఎస్సార్ అవార్డుల ఫంక్షన్ లో ఈ ఇద్దరు హీరోలు ఒక వేదిక మీదకు వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఇరువురు హీరోలు ఎదురెదురు పడనున్నట్లు తెలుస్తోంది. మామూలుగా అయితే ఇలాంటి కార్యక్రమాలకు పక్కాగా వస్తారన్న నమ్మకం లేకపోవచ్చు. కానీ.. పిలుస్తోంది సుబ్బిరామిరెడ్డి కావటంతో ఇద్దరు హీరోలురావటం ఖాయమని చెబుతున్నారు. మరిద్దరు ఎదురెదురు పడినప్పుడు మర్యాద కోసమైనా ఫోటోలకు ఫోజులివ్వటం ఖాయమంటున్నారు.

బాలకృష్ణతో కలిసి పోవటానికి నాగ్ ఎప్పటి నుంచో రెడీ గా ఉన్నాడు.గౌతమి పుత్ర శాతకర్ణి మూవీ ఘన విజయం సాధించినపుడు నాగ్ ట్వీట్ కూడా చేశాడు..ఇటీవల కాలంలో బాలకృష్ణ తీరు చాలానే మారిందన్న మాట వాస్తవం. నలుగురిని కలుపుకుపోయేలా ఆయన వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా.. చిత్ర పరిశ్రమలో తన బ్రాండ్ ను మరింత పెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు బాలకృష్ణ.. టీఎస్సార్ అవార్డుల కార్యక్రమంలోనైన వీళ్ళిద్దరూ కలిసి గతంలో పెరిగిన దూరాన్ని తగ్గించుకోవాలని ఆశిద్దాం…. ఇదే కనుక జరిగితే ఇంకా అక్కినేని-నందమూరి ఫాన్స్ పండగ చేసుకోవటం ఖాయం

Leave a Reply