చైతు సమంతలకు బ్రేక్ వేసిన నాగ్…

99

Posted November 29, 2016, 4:47 pm

Image result for nagarjuna and naga chaitanya and samantha

అదేంటి త్వరలో పెళ్లి చేసుకోబోతున్న నాగ చైతన్య సమంతల ప్రేమకు కింగ్ నాగార్జున కూడా ఒప్పుకున్నాడు కదా మళ్లీ ఇద్దరి మధ్య బ్రేక్ కు ఎందుకు కారణమవుతాడు అంటే.. ఓ పక్క పర్సనల్ లైఫ్ విషయాలతో బిజీగా ఉంటున్న చైతు, సమంతలు ఇక ప్రొఫెషనల్ గా కూడా బిజీగా మారాలని చూస్తున్నారు. ఆ క్రమంలో ప్రేమం, సాహసం శ్వాసగా సాగిపో హిట్ల తర్వాత చైతు సోగ్గాడే చిన్ని నాయనా డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ డైరక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ స్టార్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఓకే అయ్యింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు సమంతను పెట్టే ఆలోచన చేశారట. కాని పెళ్లికి సిద్ధమవుతున్న చైతు, సమంతలు సినిమాలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని నాగ్ వద్దనేశాడట. సో అలా చైతు సినిమాకు సమంత దూరమయ్యింది. అయితే నిర్ణయం నాగార్జునదే అయినా దాన్ని గౌరవిస్తూ సమంత వచ్చిన అవకాశాన్ని కూడా కాదని చెప్పేసిందట.

ఓ మొత్తానికి పెళ్లికి దగ్గరవుతున్న ఈ జంటను దూరం చేసే పనిలో పడ్డాడు నాగార్జున. అన్నపూర్ణ బ్యానర్లో నిర్మిస్తున్న ఈ సినిమా కూడా సొగ్గాడి లాంటి హిట్ ఇస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here