మనమంతా చూసి మన్మధుడు ఛాన్స్ ?

 nagarjuna chance next movie chandrasekhar yeleti

మనమంతా సినిమాను హృద్యంగా తెరకెక్కించి ప్రశంసలందుకుంటున్నారు చంద్రశేఖర్ యేలేటి. తమిళం – మలయాళం భాషల్లో ‘మనమంతా’ చూసిన ప్రేక్షకులు స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నారట. తెలుగులోనూ ఆ సినిమాని చూసినవాళ్లంతా బాగుందంటున్నారు కానీ వసూళ్లే పెరగడం లేదు. ఈ సినిమాని ఓ కళాఖండంగా భావిస్తున్న కథానాయకులంతా యేలేటి తమకోసం కథని సిద్ధం చేస్తే ఏమాత్రం ఆలోచించకుండా నటించాలని డిసైడ్ అయ్యారు.

అయితే ఈ దర్శకుడు మాత్రం నాగార్జునతో ఓ సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నారు. యేలేటి తయారు చేసిన కథ నాగ్ కి బాగా నచ్చడంతో పాటూ ఈ సినిమా చేస్తానని ఆయన ఒప్పుకొన్నట్టు తెలిసింది. త్వరలోనే నాగ్ – యేలేటి చిత్రంపై ప్రకటన వెలువడే అవకాశాలున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం నాగార్జున రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓం నమో వేంకటేశాయ చేస్తున్నారు.

SHARE