Posted [relativedate]
బొమ్మరిల్లు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానం భవతి సినిమాలని నిర్మించి ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పించడంలో దిట్ట… నిర్మాత దిల్ రాజు. ఇక నిన్నేపెళ్లాడుతా, మనం, సంతోషం, హలో బ్రదర్, సోగ్గాడే చిన్న నాయనా వంటి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలతో ఆకట్టుకోగల సత్తా ఉన్న టాప్ హీరో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ పండగే. ఈ పండుగ సంక్రాంతికి రానుంది.
సంక్రాంతి బరిలో నిలవనున్న ఈ సినిమాకు శ్రీనివాస కళ్యాణం అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించాడట దిల్ రాజు. శతమానం భవతి సినిమాకు దర్శకత్వం వహించి విజయం సాధించిన సతీష్ వేగ్నేషే ఈ తాజా సినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నాడట.
కాగా నాగార్జున రాజుగారి గది 2 సినిమా షూటింగ్ తర్వాత ఈ సినిమాను పట్టాలెక్కించనున్నాడట దిల్ రాజు. ఈ సినిమాలో నాగ్ సెంటిమెంట్ హీరోయిన్ రమ్యకృష్ణ… నాగ్ సరసన నటించనుందని సమాచారం. మరి సంక్రాంతికి దిల్ రాజు జరిపించబోయే శ్రీనివాస కళ్యాణం ఎలా ఉంటుందో చూడాలి.