వయసు మీద నాగ్ కామెంట్..!

110

Posted November 28, 2016, 8:55 am

Image result for nagarjuna comment on his age in raju gari gadhi movie opening

కింగ్ నాగార్జున స్టార్ హీరోలు ఎంతమంది ఉన్నా సరే నవయువ మన్మధుడిగా నాగ్ అమ్మాయిల కలల రాకుమారుడుగా అభిమానాన్ని సంపాదించాడు. తనయులు హీరోగా వచ్చినా సరే నాగార్జున సినిమా సినిమాకు గ్లామర్ పెరిగిపోతుంది. అయితే ఈ క్రమంలో తన వయసు మీద హాట్ కామెంట్స్ చేశాడు నాగార్జున. తనకు వయసు మీద పడుతుందని ఎన్ని సినిమాలు లీడ్ రోల్ చేస్తానో తెలియదు కాని కెరియర్ లో హర్రర్ నేపథ్యంలో ఓ సినిమా చేయాలని అనుకున్నా అది రాజు గారి గది-2 వల్ల అవుతుందని అన్నారు.

ఓంకార్ డైరక్షన్లో వస్తున్న రాజు గారి గది-2 సినిమా ఓపెనింగ్ రోజు నాగ్ పై విధంగా మాట్లాడటం జరిగింది. చిన్నప్పటి నుండి హర్రర్ సినిమాలు చూస్తూ ఉన్నాం అయితే తన కెరియర్ లో ఇదో కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఇప్పటిదాకా నటించిన సినిమాల కన్నా ఇది కొత్తగా ఉంటుంది. అంతేకాదు ఈ సినిమా ట్రెండ్ సృష్టిస్తుంది అంటున్నాడు నాగార్జున. కేవలం హీరోగానే కాకుండా సపోర్టింగ్ రోల్ కు తాను సిద్ధమే అని ఎప్పటినుండో చెప్పుకొస్తున్న నాగ్ తన వయసు మీద పడుతుందని సరదా కామెంట్స్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here