Posted [relativedate]
ఫిలిం నగర్ తాజాగా హల్ చల్ చేస్తున్న మరో వార్త… అక్కినేని నాగార్జున,నాగ చైతన్య హీరోలుగా దిల్ రాజు నిర్మాతగా శతమానంభవతి దర్శకుడు సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో మల్టీస్టారర్ వస్తోందట.అయితే ఇప్పటికి కథ,కధనాల విషయంలో పూర్తి స్థాయి చర్చలు,నిర్ణయాలు జరగలేదట. దీంతోనే ఈ సినిమా గురించి సందేహాలు వస్తున్నాయి.ఈ రోజుల్లో హీరోలు కధల గురించి ఎంత నిక్కచ్చిగా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.కథ నచ్చకపోతే ఎంత పెద్ద దర్శకుడు అయినా హీరోలు స్మూత్ గా నో చెప్పేస్తున్నారు.అందుకు పెద్ద ఉదాహరణ పూరి జగన్నాథ్.అయన తీసిన ఇజం ప్లాప్ అయ్యాక ఎందరు హీరోల్ని కలిసినా ఒక్కరు ఇప్పటిదాకా ఓకే చెప్పలేదు.ఇప్పుడు సతీష్ వేగేశ్న తీసిన శతమానంభవతి చూసి నాగ్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్న మాటల్ని అంతగా నమ్మడానికి వీల్లేదు.ఈ సినిమాకి ముందు ఓ ప్లాప్ సినిమా,ఇంకో ఆగిపోయిన సినిమాకి సతీష్ దర్శకుడిగా పనిచేశారు.
ఓ రచయితగా తన క్యాంపు లో పని చేసిన సతీష్ చెప్పిన కధకి దిల్ రాజు ఇంప్రెస్ అవ్వడంతో శతమానంభవతి తెరకెక్కింది.ఇప్పుడు ఆ సినిమా ప్రమోషన్ కోసమే ఇలాంటి లీక్ లు ఇస్తున్నారని కూడా ఓ వాదన వినిపిస్తోంది.అయితే నాగ్ గతంలో గులాబీ లోని ఓ పాట చూసి కృష్ణ వంశీకి నిన్నే పెళ్లాడతా అవకాశం ఇచ్చారు.అందుకే ఇప్పుడు కూడా నాగ్ ఓకే చెప్పరేమో అన్న డౌట్ కూడా లేకపోలేదు.ఏదేమైనా మరి కొంత కాలం ఆగితేగానీ అక్కినేని మల్టీస్టారర్ వార్తల్లో నిజమేతో తేలుతుంది.