ఓం నమో వెంకటేశాయ సెన్సార్ టాక్ ..

Posted February 1, 2017

nagarjuna om namo venkatesaya movie censor report“ఓం నమో వెంకటేశాయ ” ఈ రోజు సెన్సార్ కార్యక్రమం పూర్తి చేసుకుంది.ఫిబ్రవరి 10 న విడుదల కాబోతున్న ఈ సినిమా కి సెన్సార్ బోర్డు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చింది.ఎలాంటి కట్టింగ్స్ లేకుండా ఈ సినిమా సెన్సార్ టెస్ట్ పాస్ అయిపోయింది.ఇక ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులంతా ఏకగ్రీవంగా ఒకటే మాట చెప్పారట.ఇది అన్నమయ్యని మించిన సినిమా అవుతుందని. అన్నమయ్యలో క్లైమాక్స్ తో పాటు కొన్ని కీలక సీన్లు,పాటలు,సంగీతం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటే …ఈ సినిమా ఆసాంతం ఓ ఆధ్యాత్మిక ప్రయాణం చేసినట్టు అనిపించిందట సెన్సార్ బోర్డు సభ్యులకి.

“ఓం నమో వెంకటేశాయ తన చివరి చిత్రం కావొచ్చని దర్శకుడు రాఘవేంద్రరావు అక్కడక్కడా చెబుతున్న విషయం తెలిసిందే.ఆయన అలా ఎందుకన్నారో గానీ నిజంగా ఇంతకంటే అద్భుతమైన భక్తి రస చిత్రం చేయడం ఆయన వల్ల కూడా కాదేమో అంటున్నారట సెన్సార్ బోర్డు మెంబర్లు.ఏదేమైనా సెన్సార్ టాక్ తెలుసుకుని అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

SHARE