Posted [relativedate]
మరో మన్మధుడు రావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదూ. నిజమే రీసెంట్ గా అల్లరి అల్లుడిగా మారిన అక్కినేని వారసుడు నాగ చైతన్య మన్మధుడు లాగా అభిమానులను అలరించనున్నాడట.
త్రివిక్రమ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన మన్మధుడు సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా అందించిన విజయంతో యువ సామ్రాట్ అన్న బిరుదు పోయి నాగార్జునని టాలీవుడ్ మన్మధుడు అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో ఓ కధను నాగ చైతన్య చేయనున్నాడట. ఈ సినిమాకు కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసే దర్శకత్వం వహించనున్నాడు.
ప్రస్తుతం నాగచైతన్య కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అల్లరి అల్లుడు సినిమా చేస్తుండగా, త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నాడు. ఈ రెండు సినిమాలు దాదాపు ఒకే సారి కంప్లీట్ కానున్నాయి. ఈ సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత చైతూ, త్రివిక్రమ్ ల ప్రాజెక్ట్ ను ప్రారంభం కానుంది. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మించనున్నాడు. అక్టోబర్ లో ప్రారంభించి సంక్రాంతికి రిలీజ్ చేసే ఉద్దేశంలో ఉన్నాడట నాగ్. మరి ఈ లేటెస్ట్ మన్మధుడు ఎలాంటి హిట్ ని అందుకుంటాడో చూడాలి.