రా రండోయ్.. అంటున్న నాగ్ వారసులు

0
621
nagarjuna registered movie title raa randoy veduka chuddam

Posted [relativedate]

nagarjuna registered movie title raa randoy veduka chuddamరా రండోయ్.. వేడుక చూద్దాం అంటున్నారు  నాగ్ వారసులు. ఇదేదో నాగచైతన్య పెళ్లికో లేక అఖిల్ పెళ్లికో లేక వారింట్లో ఏదైనా పంక్షన్ కో అనుకుంటే పొరపాటే. ఇది  ఓ సినిమా టైటిల్. అవును అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించాడు. దీంతో ఈ టైటిల్ చర్చనీయాంశంగా మారింది. మరి ఈ టైటిల్ చైతూ చిత్రానికా లేక అఖిల్ రెండో సినిమాకా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ టైటిల్ అఖిల్ సినిమాకేనని చెబుతున్నారు యూనిట్ సభ్యులు. అందుకు కారణాలు ఉన్నాయని అంటున్నారు.

మనం లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను అందించిన విక్రమ్ కుమార్.. అఖిల్ రెండో  సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అఖిల్ సినిమా ముందు యాక్షన్ ఫార్మాట్ లో అనుకున్నా.. తాజాగా ఆ సినిమాకి   ఫ్యామిలీ సన్నివేశాలను కూడా  అడాప్ట్ చేశారట. దీంతో రా రండోయ్.. వేడుక చూద్దాం అనే టైటిల్ ను నాగ్.. అఖిల్ కోసమే రిజిస్టర్ చేయించాడని చెప్పుకుంటున్నారు. ఆ టైటిల్ ఎవరి కోసమైనా ఆ టైటిల్ వింటుంటే మాత్రం  ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని కొట్టచ్చినట్లు తెలుస్తోంది. సో.. బీ రెడీ ఫర్ రా రండోయ్.. వేడుక చూద్దాం ఆఫ్ అక్కినేని ఫ్యామిలీ.

Leave a Reply