సినిమాల‌కు నాగ్ గుడ్ బై?(వీడియో)

0
337
nagarjuna retirement plans
  Posted [relativedate]
nagarjuna retirement plansటాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున సినిమాల‌కు వీడ్కోలు చెప్ప‌నున్నారా? ఓం న‌మో వెంకటేశాయ‌… ఆయ‌న చివ‌రి సినిమానా? ఇక‌పై ఆయ‌న సినిమాల‌కు దూరంగా ఉంటారా? అంటే ఔన‌నే అనిపిస్తోంది. ఎందుకంటే స్వ‌యంగా నాగార్జున నోటి నుంచి రిటైర్మెంట్ మాట వ‌చ్చింది. 
అక్కినేని నాగార్జున లీడ్ రోడ్ లో న‌టించిన ఓం న‌మో వెంక‌టేశాయ  ఆడియో ఇటీవ‌ల‌ రిలీజైంది. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు కె. రాఘ‌వేంద్ర‌రావు. ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ లో మాట్లాడుతూ నాగ్ భావోద్వేగానికి గురయ్యారు. చెమ‌ర్చిన క‌ళ్ల‌తో త‌న అంత‌రంగాన్ని అందరితోనూ పంచుకున్నారు. తాను వెంకటేశ్వ‌ర స్వామిని మూడు కోరిక‌లు కోరుకున్నాన‌ని చెప్పుకొచ్చారు. ఆ మూడు కోరిక‌ల‌ను శ్రీనివాసుడు నెర‌వేర్చాడ‌ట‌. స్వామి త‌న కోరిక‌ల‌ను నెర‌వేర్చే కొద్దీ కోరిక‌ల చిట్టా పెరిగిపోతోంద‌న్నారాయ‌న‌. వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఎప్పుడూ నాతోనే ఉన్న‌ట్టు అనిపిస్తుంటుంది. అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, శిరిడిసాయి… ఇప్పుడు ఓం న‌మో వెంక‌టేశాయ‌లో న‌టించ‌డం త‌న అదృష్టంగా భావిస్తున్నాన‌ని నాగార్జున చెప్పారు. ఈ మాట‌ల్లో ప‌డి అస‌లు విష‌యం చెప్పారు నాగార్జున‌. బ‌హుశా ఇదే రాఘవేంద్ర రావు కి త‌నకి చివ‌రి సినిమా అవుతుందేమోన‌న్నారు. 

టాలీవుడ్ సీనియ‌ర్ హీరోల్లో నాగార్జున ఒక్క‌రే ఈ మ‌ధ్య వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్నారు. ఇంకా ఆయ‌న యాక్టివ్ గానే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ సినిమాల‌కు ఎందుకు గుడ్ బై చెబుతున్నారో ఎవ‌రికి అర్థం కావ‌డం లేదు. బ‌హుశా త‌న కొడుకుల కెరీర్ పై ఫోక‌స్ పెట్ట‌డానికే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నారేమోన‌నే మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఇత‌ర న‌ట వార‌సుల్లాగా త‌న కొడుకుల కెరీర్ అంత సాఫీగా లేదు. చైతూ అడ‌పాద‌డ‌పా హిట్లిస్తున్నా అత‌ను ఇప్ప‌టికీ పెద్ద హీరోగా ఎస్టాబ్లిష్ కాలేక‌పోయాడు. ఇక భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన అఖిల్ కూడా మొద‌టి సినిమాతో భారీ అప‌జ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్నాడు. అందుకే ఈ ఇద్ద‌రి కెరీర్ గాడిలో ప‌డేలా ప్లాన్ చేసేందుకు నాగ్ క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ట‌. అందుకే సినిమాల‌కు గుడ్ బై చెప్పేందుకు కూడా సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు టాక్. ఏదేమైనా నాగ్ ను ఇంకా హీరోగా చూడాల‌నుకునే  అక్కినేని అభిమానుల‌కు మాత్రం ఇది చేదువార్తే. 

Leave a Reply