వావ్ అనిపిస్తున్న నాగార్జున స్టేట్మెంట్..!!

Posted February 13, 2017

nagarjuna said ready to do act multi starrer movie with senior heroesటాలీవుడ్ కింగ్ నాగార్జున..  తను నటించే సినిమాలో ఏదోక కొత్తదనం ఉండాలని ఆశిస్తాడు. అందుకనే  తన జనరేషన్ హీరోలెవ్వరూ చేయన్ని ప్రయోగాలు చేశాడు. నాగ్ చేసిన సినిమాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమైపోతుంది. యాక్షన్ హీరోగా, రొమాంటిక్ హీరోగా, భక్తుడిగా, భగవంతుడిగా పలు రకాల రోల్స్ లో నటించాడు. ఇక మనం, ఊపిరి వంటి సినిమాలతో ప్రయోగాలు చేసి విజయం కూడా సాధించాడు. ఇప్పుడు తాజాగా మరో అడుగు ముందుకేసి తన తోటి హీరోలైన బాలయ్య, వెంకీ, చిరులతో మల్టీస్టారర్ లు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

సీనియర్ హీరోలతో నటించే ఛాన్స్ వస్తే తను యాక్ట్ చేస్తానని, అయితే ఇద్దరు హీరోలకి  ఈక్వల్ ఇంపార్టెన్స్  ఉండాలని స్పష్టం చేశాడు. గతంలో నాగార్జున తండ్రి నాగేశ్వరరావు, బాలయ్య తండ్రి ఎన్టీరామారావు కలిసి పలు మల్టీస్టారర్ లు చేసిన సంగతి తెలిసిందే. అయితే క్రమేపి మల్టీస్టారర్ లు తగ్గి సోలో హీరో సినిమాలకు ప్రాముఖ్యత పెరిగింది. దీంతో నాగ్, బాలయ్య, వెంకీ, చిరు కలిసి ఏ సినిమాలోనూ నటించలేదు. కానీ మళ్లీ ఇప్పుడు హీరోల ధింకింగ్ లెవెల్స్ మారుతున్నాయి. మల్టీస్టారర్ లు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ నలుగురిలో ఏ ఇద్దరు హీరోలు కలిసి చేసినా అది సెన్సేషన్ అవుతుంది. మరి నాగార్జునతో ఏ సీనియర్ కలిసి నటిస్తాడో చూడాలి.

SHARE