మన్మధ మౌనం ఎందుకు?

0
444
nagarjuna should be reveals about the akhil shriya bhupal break up

Posted [relativedate]

nagarjuna should be reveals about the akhil shriya bhupal break up
కుమారుడు అఖిల్ వివాహం గురించి నానారకాలుగా సోషల్ మీడియా వార్తలు వార్చుతున్న వేళ నాగార్జున ఉరఫ్ మన్మధ మౌనం వహించాడు.ఆ మౌనం తీక్షణత ఎంతవరకు అంటే సెల్ ఫోన్ నెంబర్ కూడా మార్చేంత అని తెలుస్తోంది.ఏ కుటుంబం లో అయినా ఇలా జరిగితే పరిస్థితి ఇలాగే ఉంటుంది.అవమాన భారం మోయడం అంత తేలిగ్గాదు.కానీ నాగ్ వ్యవహారశైలిని,మీలో ఎవరు కోటీశ్వరుడు షో తర్వాత ఆయన పరిణితి చెందిన వ్యాఖ్యలు,వ్యాఖ్యానాలు చూశాక మాత్రం నాగ్ స్థాయి వ్యక్తి ఇలా సైలెంట్ అయిపోతారని ఊహించలేం.ఎందుకంటే…కొడుకుల ప్రేమ వ్యవహారం కాస్త అటుఇటుగా ఒకేసారి బయటికొచ్చింది.దీంతో ఏదో గొడవలు జరుగుతున్నాయని …ముఖ్యంగా సమంతని చైతు చేసుకోవడం నాగ్ కి ఏ మాత్రం ఇష్టం లేదని ఎన్నో కధనాలు వచ్చాయి.వాటికి ఓ సందర్భంలో స్పందించిన నాగ్ మా కుటుంబంలో అలాంటి స్టుపిడిటీ కి తావులేదని చెప్పారు. అంటే సామాజికంగా,కుటుంబ పరంగా వచ్చే మార్పుల్ని తట్టుకోగలిగే సామర్ధ్యం తమకుందని నాగ్ స్వయంగా చెప్పుకున్నారు.ఆ కోణం లో చూస్తే నాగ్ ఇప్పుడు తప్పకుండా మాట్లాడాల్సిందే. ఎందుకంటే ..

అఖిల్ వివాహానికి సంబంధించి తప్పులు ఎవరివన్న దానిపై చర్చ అనవసరం.కానీ జరిగిన దాన్ని జీర్ణించుకుని ఊహాగానాలకు చెక్ చెప్పే ఓ ప్రకటన నాగ్ చేస్తే బాగుంటుంది.ఇలాంటి సలహా ఇస్తే ఎవరైనా అలాంటి ఘటన మీ ఇంట్లో జరిగితే ఆ నొప్పి మీకు తెలుస్తుందని అనొచ్చు. నిజమే ..కానీ వివాహ సందర్భంగా గొడవలు రావడం ఇప్పుడేమీ కొత్త కాదు.ఇకపై అలా జరగదని అంతకన్నా లేదు.కానీ ఓ గొడవ వల్ల నాగ్ లాంటి ప్రముఖుడే డీలా పడితే…ఇలాంటి అనసవసరపు విషయాలకి అధిక ప్రాధాన్యమిచ్చి ఆత్మహత్యలు,హత్యల దాకా వెళ్లడమో…మానసికంగా కుంగిపోవడమో చేసే సామాన్యులు ఇంకెంతగా కదిలిపోతారు.నాగ్ అంతటి వ్యక్తే మౌనం వహిస్తే ఇక సామాన్యులు ఇలాంటి విషయాలకు లేనిపోని ప్రాధాన్యమిచ్చే ప్రమాదముంది.ఈ తరహా ఘటనలతో జీవితాలేమీ తల్లకిందులు కావని చెప్పేందుకైనా …సామాజికంగా వున్న ఇలాంటి దౌర్భల్యాన్ని తిప్పికొట్టేందుకు అయినా నాగ్ నోరు తెరవాలి.లోక కళ్యాణం కోసం పురాణాల్లో మన్మధుడు ముక్కంటికి పూలబాణం గురిపెట్టాడు.ఈ తరం మన్మధుడు వ్యక్తులు,కుటుంబాల మధ్య విబేధాలు జీవన గమ్యాల్ని మార్చేంత పెద్ద విషయాలు కావని ,పరువు ప్రతిష్టలంటూ లేనిపోని బరువుని నెత్తికెత్తుకోవడం సరి కాదని చెప్పేందుకైనా మౌనం వీడాలి. ఓ అవాంఛిత పరిణామాన్ని సామాజిక దౌర్భల్యాన్ని రూపుమాపేందుకు వాడుకుంటే తప్పేంటి?

Leave a Reply