దాసరికి నాగ్ స్పెషల్ ట్రీట్ మెంట్ ఎందుకు?

Posted September 21, 2016

 nagarjuna special treatment dasari premam audio function
ప్రేమమ్ సినిమా ఆడియో ఫంక్షన్ లో చీఫ్ గెస్ట్ గా దాసరి నారాయణరావుకు దక్కిన గౌరవం చూశాం.నాగచైతన్య,సమంత ప్రేమ గురించి దాసరి పబ్లిక్ గా మాట్లాడిన వైనం చూశాం.తండ్రి అక్కినేని నాగేశ్వరరావు తో విభేదాలు వచ్చిన దాసరికి నాగ్ ఇంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారన్నదానిపై చిత్రసీమలో ఎవరికీ క్లారిటీ లేదు.తండ్రి మాటకి ఎక్కడలేని విలువిచ్చిన నాగ్…అయన బతికున్నప్పుడు కూడా దాసరితో రిలేషన్ కొనసాగించారు.నాగేశ్వరరావు మీద ఒకటిరెండు సందర్భాల్లో దాసరి ఘాటు విమర్శలు చేసిన విషయం నాగ్ కి బాగా తెలుసు.అయినా నాగ్ దర్శకరత్న విషయంలో సాఫ్ట్ కార్నర్ చూపించారు. గ్రీకువీరుడు సినిమాతో దాసరి కొడుకు అరుణ్ కుమార్ పరిశ్రమకి పరిచయమయ్యాడు.అప్పట్లో అరుణ్ ఎత్తుకు తగ్గ హీరోయిన్ దొరకడం కష్టమైతే నాగ్ స్వయంగా పూజ భాత్రాని ఒప్పించినట్టు దాసరి స్వయంగా చెప్పుకున్నారు.

ఓ ఫంక్షన్ ఆహ్వానం విషయంలో అక్కినేని కుటుంబం తమని అవమానించిందని ఫీల్ అయిన బాలయ్య …నాగేశ్వరరావు తో గట్టిగా మాట్లాడారని ఓ టాక్ .అప్పటినుంచే బాలయ్య,నాగ్ మధ్య సంబంధాల్లో తేడా వచ్చిందని రెండు కుటుంబాలకి దగ్గరగా మసిలిన వాళ్ళు చెప్తుంటారు.అలాంటిది నాగేశ్వరరావు తో మాట్లాడ్డం ఆలా ఉంచి విమర్శలు చేసిన దాసరికి నాగ్ స్పెషల్ ట్రీట్ మెంట్ ఎందుకిస్తున్నారో ?

SHARE