కోలీవుడ్ కి వెళ్లనున్న సోగ్గాడు..!!

0
694
nagarjuna to release soggade chinni nayana movie in kollywood

Posted [relativedate]

nagarjuna to release soggade chinni nayana movie in kollywood
ఒకప్పుడు సోగ్గాడు అంటే శోభన్ బాబే గుర్తొచ్చేవాడు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ సోగ్గాడు ఎవరంటే కింగ్ నాగార్జున అనే చెబుతున్నారు సినీ అభిమానులు. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సోగ్గాడే చిన్ని నాయన సినిమా సూపర్ హిట్ ను సాధించమే అందుకు కారణం.

కాగా టాలీవుడ్ లో ప్రయోగాత్మక చిత్రాలు చేయడంతో పాటు వాటిని కమర్షియల్ సక్సెస్ చేయడంలోనూ సక్సెస్ సాధించిన నాగ్ ప్రస్తుతం కోలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల ఊపిరి సినిమాను తమిళనాట తోళాగా రిలీజ్ చేసి అక్కడ కూడా హిట్ టాక్ ను సాధించాడు. ఈ జోష్ తోనే సోగ్గాడే చిన్ని నాయన సినిమాను కూడా తమిళంలో విడుదల చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టాడట. ‘సోక్కాలి మైనర్’ అనే పేరుతో ఆ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ వేసుకుంటున్నాడు.

అయితే ఊపిరి సినిమాలో తమిళ హీరో కార్తీ ఉండడంతో ఆ సినిమాను తమిళ తంబిలు సక్సెస్ చేశారని, మరి సోగ్గాడే చిన్ని నాయనలో తమిళ ఫ్లేవర్స్ లేవు కాబట్టి ఎలా ఆదరిస్తారో వేచి చూడాలని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Leave a Reply