నాగ్ ఈజ్ బ్యాక్

0
381
nagarjuna tweet back in business with raju gari gadhi 2

Posted [relativedate]

nagarjuna tweet back in business with raju gari gadhi 2గత 20రోజులుగా అక్కినేని ఫ్యామిలీని పట్టిపీడిస్తోంది అఖిల్.. శ్రియ భూపాల్ ల వివాహ రద్దు. ఈ సంగతి బయటకి వచ్చిన దగ్గర నుండి ఇక సోషల్ మీడియాలో నాగార్జున గురించి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఓం నమో వేంకటేశాయ ఫ్లాఫ్ తో అప్ సెట్ అయిన నాగ్.. అఖిల్ పెళ్లి రద్దుతో  మరింత కుంగిపోయాడని వార్తలు వచ్చాయి. సన్నిహితులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఫోన్ నెంబర్ కూడా మార్చేశాడని అన్నారు. మీడియా వాళ్ల కంటపడకుండా తిరుగుతున్నాడని, అలానే రాజుగారి గది-2 లొకేషన్స్ లో కూడా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని… ఇలా రకరకాలుగా మీడియా తన స్టైల్లో వార్తలు కుమ్మరించేసింది. అయినా నాగ్ మాత్రం ఈ విషయాలేమీ తనకు పట్టనట్లు వ్యవహరించాడు.

అయితే అఖిల్ వ్యవహారం నుండి నాగ్ కాస్త ఇప్పుడిప్పుడే  బయటపడుతున్నట్లు ఉన్నాడు.  తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ పిక్ ను పోస్ట్ చేసి,  ఇప్పుడిప్పుడే తన  పనుల్లో  బిజీ అవుతున్నట్లు చెప్పకనే చెప్పాడు. ‘రాజుగారి గది-2’ షూటింగ్‌ స్పాట్‌ లో తీసిన ఫోటోను తన ట్విట్టర్‌ అకౌంట్‌ లో పోస్ట్‌ చేశాడు  నాగ్‌.  ‘బ్యాక్‌ ఇన్‌ బిజినెస్‌ విత్‌ రాజుగారి గది’ అని ట్వీట్ కూడా చేశాడు. డిఫరెంట్ లుక్ లో నాగార్జున చాలా క్యూట్ గా ఉన్నాడు. పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా అఖిల్ పెళ్లి గురించి నాగ్ స్పందిస్తాడని ఎదురుచూసిన  అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది.

Leave a Reply