మోడీ,నాగ్ అక్కడ మాట్లాడుకున్నారు…

Posted November 9, 2016

nagarjuna tweet in twitter about taxpayers modi was retweet on this post
500,1000 నోట్ల రద్దుకు ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని గ్రీకు వీరుడు నాగ్ స్వాగతించారు.దేశాన్ని బలమైన ఆర్ధిక శక్తిగా తీర్చిదిద్దే నిర్ణయంగా అయన ట్వీట్ చేశారు.మోడీ నిర్ణయం తన లాగా పన్ను కట్టేవాళ్ళకి బహుమతి అని నాగ్ చేసిన ట్వీట్ కి మోడీ అదే వేదికపై బదులిచ్చారు.దేశాభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్న అవినీతి,నల్లధనం,నకిలీ కరెన్సీ వంటి సమస్యలకి తాజా నిర్ణయం దోహదపడుతుందని మోడీ రీట్వీట్ చేశారు.ఆ విధంగా దేశానికి సంబందించిన ఓ కీలక నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా మోడీ,నాగ్ అభిప్రాయాలు పంచుకున్నారు.మోడీ ప్రధాని అయ్యాక ఆయన్ను ప్రత్యేకంగా కలిసిన వారిలో నాగ్ కూడా వున్న విషయం తెలిసిందే.

Tweeting frm Paris/congrats Ji!!for rewarding us tax payers/india on the way to become a super economy

Narendra Modi Retweeted Nagarjuna Akkineni

Dear , this step will check corruption, black money and fake currency rackets that slow our progress.

Narendra Modi added,

SHARE