నాగ్, వెంకీ తగ్గినట్టే !

 Posted October 29, 2016

nagarjuna venkatesh movies not release sankranthi seasonవచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ యుద్ధం యమా రంజుగా ఉండబోతుందని ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయింది.మెగాస్టార్ చిరంజీవి,నందమూరి బాలకృష్ణ ఒక్కరోజు తేడాతో బాక్సాఫీస్ దగ్గర యుద్దానికి బరిలోకి దిగుతున్నారు.ఇప్పటికే మెగాస్టార్ ప్రీరిలీజ్ బిజినెస్ తో అదరగొడుతున్నాడు.మరోవైపు,’గౌతమిపుత్ర శాతకర్ణి’ టీజర్ తో దుమ్ములేపుతున్నాడు బాలయ్య. శాతకర్ణి టీజర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ ని సాధించింది.దీంతో..ఈ రెండు సినిమాల కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అర్థమవుతోంది.ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ దగ్గర సై అంటే సై అనడం ఖాయం.

మరోవైపు,వీరి అభిమానులు కూడా ఏమాత్రం తగ్గడం లేదు.మెగాస్టార్ అభిమానులు మెగా రీ-ఎంట్రీ చిత్రం కోసం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.ఇక ,బాలయ్య ఫ్యాన్స్…బాలయ్య నటించిన 99 సినిమాలని రోజుకో సినిమాని ప్రదర్శిస్తూ తమ అభిమానాన్ని చాటుతున్నారు.మొత్తానికి..అభిమానుకు కూడా సంక్రాంతి సినిమాలని ప్రెస్టేజియస్ గా తీసుకొంటున్నారు. రిలీజ్ తేది దగ్గరపడుతుండటంతో ఈ హీట్ మరింత హీటెక్కెడం ఖాయంగా కనిపిస్తోంది.

చిరంజీవి, బాలయ్య సినిమాలతో పాటు మరో ఇద్దరు అగ్రహీరోల సినిమాలు కూడా షూటింగ్ జరుపుకుంటున్నాయి.వారే నాగ్, వెంకీ.నాగార్జున-రాఘవేంద్ర రావు కలయికలో తెరకెక్కుతోన్న భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’.నాగ్ సంక్రాంతి అంటే మహా ఇష్టం.గత యేడాది సంక్రాంతికి తీవ్ర పోటీ మధ్య  ‘సోగ్గాడే చిన్నినాయన’ వచ్చి హిట్ కొటాడు నాగ్.ఈ యేడాది కూడా’ఓం నమో వేంకటేశాయ’ సంక్రాంతి బరిలో దిగుదామని ఆశపడుతున్నాడు. కానీ.. భక్తిరస చిత్రం పోటీ మధ్య వస్తే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని సన్నిహితులు చెప్పడంతో వెనకడుగు వేస్తున్నారు. వెంకీ ‘గురు’ కూడా సంక్రాంతికి గురి పెట్టింది. గతంలో వెంకీ ఖాతాలో సంక్రాంతి హిట్స్ ఎన్నో ఉన్నాయ్. అయితే, గతం ఘనం అని మురిసిపోయి.. ఇప్పుడు ‘గురు’ని తీసుకొస్తే దెబ్బడిపోతుందని భావిస్తున్నాడు. అందుకే వెనక్కి తగ్గాడు.

మొత్తానికి.. వచ్చే సంక్రాంతి బాక్సాఫీస్ యుద్దం నుంచి నాగ్ వెంకీ తప్పుకున్నట్టే మరీ.. !

SHARE