ఫైనల్ డెసిషన్ తీసుకున్న అమల..

Posted March 21, 2017

nagarjuna wife amala decided to goodbye moviesఅమల అక్కినేని…ఈమెకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ కింగ్ నాగార్జున సతీమణిగా, ఒకనాటి టాప్ హీరోయిన్ గా అన్నింటికీ మించి బ్లూ క్రాస్ మెంబర్ గా ఆమె సుపరిచితురాలు. ఒకప్పుడు పలు హిట్ సినిమాల్లో నటించిన అమల…  అక్కినేని వారింటి కోడలు అయిన తర్వాత సినీ జీవితానికి స్వస్తి చెప్పింది. అయితే ఇటీవల నాగ్ ఎంకరేజ్ మెంట్ తో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. అది నిరాశపరచడంతో హిందీలో హ‌మారీ అదూరి క‌హానీ చిత్రంలో నటించి బాలీవుడ్ లో లక్ ని పరీక్షించుకుంది. అక్కడ కూడా రీ ఎంట్రీ వర్కౌట్ అవ్వలేదు. ఇక ముచ్చటగా మూడోసారి మాలీవుడ్ లో తన ఫ్రెండ్ రూపొందించిన చిత్రం సైరాభానులో కూడా చేసింది. అదీ కూడా పల్టీకొట్టడంతో బాగా డిజప్పాయింట్ అయ్యిందట.

ఇలా అమ‌ల  మూడు ప‌రిశ్ర‌మ‌ల్లో రీఎంట్రీ ఇచ్చినా అన్నిచోట్లా ఫ్లాప్‌ లే  ఎదురొచ్చాయి. దీంతో ఇక న‌ట‌న‌కు పూర్తిగా ఫుల్‌ స్టాప్ పెట్టేయ్యాలని  అమ‌ల డిసైడ్ అయ్యిందట. ఈ విషయంలో నాగ్ నచ్చచెప్పినా ఫలితం లేకపోయింది. ఇక  బ్లూక్రాస్ వ్య‌వ‌హారాల‌తోనే బిజీగా గడపాలని నిర్ణయించుకుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

SHARE