‘అలెగ్జాండర్‌’గా తేజు.. అదిరిపోయింది!

 Posted October 21, 2016

 nakshatram movie sai dharam tej first lookకృష్ణ వంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్-రెజీనా జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘నక్షత్రం’. ఇదో పోలీస్ థ్రిల్లర్. ఇందులో సాయి ధరమ్ తేజ్ , ప్రగ్యా జైస్వాల్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబధించి పాత్రల ఫస్ట్ లుక్స్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ‘నక్షత్రం’ టైటిల్ లోగో, సందీప్ కిషన్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్ ల ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశాడు చెర్రీ. తాజాగా, సాయి ధరమ్ తేజ్ కొత్త లుక్ బయటికివచ్చింది. ఇందులో ‘అలెగ్జాండర్‌’ అనే పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. పోలీస్ డ్రెస్ లో తేజు లుక్ అదిరిపోయింది.

నక్షత్రంలో తేజు లుక్ పై రాంచరణ్ ఫిదా అయిపోయాడు.. “సాయి నీవు లక్కి ఆర్టిస్ట్. ఇంత తక్కువ టైం లో వంశీ గారి ఫ్రేం లో నీవు కనిపించడం చాలా లక్కీ. లుక్ కూడా చాలా డిఫరెంట్ గా వుంది. అల్ ది వెరీ బెస్ట్” చెర్రీ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలావుండగా.. ‘నక్షత్రం’ తర్వాత కృష్ణవంశీ బాలకృష్ణ ‘రైతు’ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లనున్నారు. ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

[wpdevart_youtube]u2EuWyjBo-k[/wpdevart_youtube]

SHARE