నల్గొండ కాంగ్రెస్ లో అంతర్యుద్ధం!!

0
550
nalgonda district congress party leaders fighting

Posted [relativedate]

nalgonda district congress party leaders fighting
నల్గొండ జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట. ఏళ్లుగా ఇక్కడ కాంగ్రెస్ దే ఆధిపత్యం. టీడీపీ హవా నడిచిన తరుణంలోనూ ఇక్కడ కాంగ్రెస్ ఓటుబ్యాంకుకు పెద్దగా నష్టం జరగలేదు. అందుకు కారణం ఇక్కడ హస్తానికి మొదటి నుంచి రెడ్లు అండగా ఉన్నారు. అది అలాగే కొనసాగుతోంది. ఇప్పటికీ నల్గొండలో కాంగ్రెస్ బలంగానే ఉంది. అయితే పార్టీ బలంగా ఉన్నప్పటికీ .. నేతల మధ్య పోరుతో పార్టీకి నష్టం జరుగుతుందనేది క్యాడర్ చెబుతున్న మాట.

ప్రస్తుతం నల్గొండ కాంగ్రెస్ లో యోధానుయోధులున్నారు. అది కూడా రాష్ట్ర స్థాయినేతలు. వారే జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి. ఇందులో జానా, ఉత్తమ్, కోమటిరెడ్డి ప్రస్తుతం అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ముగ్గురికీ కాంగ్రెస్ హైకమాండ్ తోనే కాకుండా ఇతర జిల్లాల నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ సాన్నిహిత్యం వల్లే వీరి మాట ఢిల్లీలోనూ చెల్లుతుందని చెబుతారు. అయితే వీరి మధ్య అంతర్యుద్ధం జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. సీఎల్పీ నేతగా జానారెడ్డి పనితీరు బాగాలేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ భావిస్తున్నారట. ఈ విషయంలో హైకమాండ్ కు కంప్లయింట్ చేశారట. ఇక కోమటిరెడ్డి అయితే ఈ ఇద్దరూ ఫెయిల్ అవుతున్నారని చాలాకాలంగా బహిరంగంగానే చెబుతున్నారు. అటు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తానేం తక్కువ కాదంటూ కోమటిరెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. ఇక రాంరెడ్డి దామోదర్ రెడ్డికి మొదటి నుంచి కోమటిరెడ్డి అంటే అస్సలు పడదు. 2014లో అంతర్గత విభేదాల వల్లే నల్గొండలో కాంగ్రెస్ కు ఓ ఎంపీ సీటు పోయిందని ఇప్పటికీ చెబుతుంటారు. ఈ రెడ్ల మధ్య కొట్లాటతో ఇప్పటికే పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వీరితో పడలేక ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కారెక్కేశారు. ఇక తర్వాతి వంతు కోమటిరెడ్డిదని ప్రచారం జరిగింది. కానీ ఎందుకనో అది వర్కవుట్ కాలేదు. ప్రస్తుతానికి ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నారు. అంతేకాదు పీసీసీ చీఫ్ పదవిని ఆయన ఆశిస్తున్నారట.

ఇలా ఆధిపత్యం, పదవుల కోసం ఈ నాయకులంతా పార్టీని బజారు కీడుస్తున్నారని పార్టీ క్యాడర్ లొల్లి చేస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ అయినా ఈ యోధులను ఒక్కతాటిపైకి తీసుకురావాలని ఆశిస్తున్నారు. లేకపోతే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కు మరింత నష్టం జరుగుతుందని టాక్.

Leave a Reply