కాంగ్రెస్ లో గ్యాంగ్ ఆఫ్ గందరగోళం

0
616
nalgonda gang disturbance in congress party

 

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

తెలంగాణ కాంగ్రెస్ లో నల్గొండ గ్యాంగ్ కలకలం రేపుతోంది. పార్టీని ముంచినా, తేల్చినా వాళ్లేనని అంతా అనుకుంటున్నారు. సీఎల్పీ నేత జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీనియర్లు కోమటిరెడ్డి బ్రదర్స్, పాల్వాయి.. వీళ్లంతా నల్గొండ గ్యాంగే. పార్టీకి దిశానిర్దేశం చేసే ఇంతమంది నేతలు ఒకే జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండటంతో.. తెలంగాణ కాంగ్రెస్ లో నల్గొండ జిల్లా ప్రాధాన్యత పెరిగిపోయింది. కానీ ఈ నల్గొండ గ్యాంగ్ ఐకమత్యంగా ఉంటే.. ఎంత బాగుండు అన్న కామెంట్లు మాత్రం బాగా వినిపిస్తున్నాయి.

టీకాంగ్రెస్ లో ఉన్న ఆధిపత్య పోరులో.. నల్గొండ గ్యాంగ్ వర్గ విభేదాలు వేరే అన్నంత రేంజ్ లో గొడవలున్నాయి. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి పడదు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కోమటిరెడ్డి బ్రదర్స్ అంతెత్తున లేస్తుంటారు. సీనియర్ పాల్వాయి ఎవర్నీ వదలకుండా విమర్శలు చేస్తారు. కలిసికట్టుగా పార్టీని అధికారంలోకి తీసుకురావల్సిందిపోయి.. తమలో తాము వాదులాడుకుంటున్న కాంగ్రెస్ నేతలు.. క్యాడర్ ను నిరాశ నిస్పృహల్లో ముంచేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయనేది అనుమానంగా మారింది.

టీఆర్ఎస్ హవాలో కూడా నల్గొండ ఓటర్లు మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టారు. అందుకే చాలా మంది సీనియర్లు ఇక్కడ్నుంచి గెలిచారు. అయితే దురదృష్టవశాత్తు వీరి మాటలు, చేష్టలు అధికార పార్టీకే ఉపయోపడుతున్నాయి. సీఎల్పీ నేత జానారెడ్డి ఏం మాట్లాడినా.. అధి కేసీఆర్ కు అనుకూలంగా మారిపోతుంది. ఇక కోమటిరెడ్డి బ్రదర్శ్, ఉత్తమ్ ఫైట్ టీఆర్ఎస్ కు అనుకోని వరంగా మారింది. దీంతో నల్గొండను కూడా గులాబీ కంచుకోటగా మార్చడానికి మంత్రి జగదీష్ రెడ్డికి పని తేలికౌతోంది.

Leave a Reply