అర్ధరాత్రి అడవిలో ట్రాఫిక్ జామ్…

Posted September 30, 2016

 nallamala forest traffic jam mid night

అర్ధరాత్రి సమయంలో అడవిలో ట్రాఫిక్ జామ్ అయితే? ఏ జంతువు ఎటు వైపు నుంచి దాడి చేస్తుందో? ఈ ఆలోచనలే అంత భయంకరంగా వున్నాయి కదూ! కానీ ఇది నిజంగా అనుభవంలోకి వచ్చింది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఈ పరిస్థితుల్లో 7 గంటలపాటు క్షణమొక యుగంలా గడిపారు. నిద్ర కరువై, సెల్ సిగ్నల్ అందక నన ఇబ్బందులు పడ్డారు.

విజయవాడ నుంచి కర్నూలు మీదుగా అనంతపురం వెళ్లే రోడ్డు మార్గం ఈ ఘటనకు వేదికైంది. ఈ దారిలో నల్లమల అటవీప్రాంతంలో రాత్రి ఒంటిగంట సమయంలో రెండు లారీలు ఎదురెదురుగా వచ్చి ఇరుక్కుపోయాయి. దీంతో తెల్లారేదాకా రెండువైపుల పెద్దసంఖ్యలో వాహనాలు ఆగిపోయాయి. సమాచారం అందిద్దామంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా అందలేదు. ప్రయాణికులతో పాటు వారికోసం ఎదురుచూసే బంధువులు కూడా ఎంతగానో తల్లడిల్లారు. తెల్లవారాక ట్రాఫిక్ క్లియర్ కావడంతో బతుకు జీవుడా అనుకుంటూ గమ్యాలకి చేరుకున్నారు.

SHARE