మహేష్ టాటూ వేయించుకున్న అర్ధాంగి..

  namratha right hand  mahesh tattoo

మహేష్ బాబుతో పెళ్లయ్యాక గ్లామర్ ఇండస్ట్రీకి బై చెప్పేశారు నమ్రత. మిస్ ఇండియా, పాపులర్ నటి లాంటి టాగ్స్ అన్నింటినీ వదిలేసుకుని.. భర్త ఆశించిన మేరకు గృహిణిగా సెటిలైపోయారు. మహేష్ చిత్రాలకు బ్యాక్‌ స్టేజ్‌ వ్యవహారాలు, పిల్లల ఆలనాపాలనా చూస్తూ గడిపేస్తున్నారు. సొంతంగా తెచ్చుకున్న గుర్తింపు కంటే.. మహేష్ భార్యగా పిలిపించుకోవడాన్నే ఇష్టపడే నమ్రత తాజాగా ఓ ఈవెంట్‌కు మోడ్రన్ లుక్‌లో దర్శనమిచ్చారు.

సూపర్‌స్టార్ అర్ధాంగి ఇలాంటి డ్రస్సింగ్‌లో కనిపించడం సాధారణమే అయినా.. ఆమె కుడి చేతిపై ఉన్న టాటూనే అందరినీ ఆకట్టుకుంది. భర్త మహేష్ పేరును ఇంగ్లీష్‌లో టాటూ వేయించుకున్నారామె. ఇష్టమైన వారి పేర్లను పచ్చబొట్లుగా పొడిపించుకోవడం మామూలే. ఇలా టాటూలు వేయించుకున్న సెలబ్రిటీల గ్యాంగ్‌లో నమ్రత కూడా అధికారికంగా చేరిపోయారన్నమాట.

SHARE