హరికృష్ణ దారెటు?

 Posted October 24, 2016

nandamuri harikrishna political career
నందమూరి హరికృష్ణ కొన్నాళ్లుగా కొడుకుల సినిమా ఫంక్షన్స్ తప్ప రాజకీయ యవనిక మీద కనిపించడం లేదు.టీడీపీ లో తనకి అంత ప్రాధాన్యం లేదని తెలిసినా కొన్నాళ్ళు అయన పార్టీ కార్యక్రమాల్లో కనిపించారు.ఎప్పుడైతే లోకేష్,ఎన్టీఆర్ మధ్య పోటీ వ్యవహారం ముందుకొచ్చిందో..2014 ఎన్నికల్లో పార్టీ గెలిచిందో అంతకుముందున్న కొద్దిపాటి ప్రాధాన్యం కూడా తగ్గింది.అప్పటినుంచి అయన రాజకీయ మౌనముద్ర వహించారు.అయితే మరికొద్ది రోజుల్లో అయన మౌనం వీడే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.వైసీపీ ముఖ్యులు ఆయన్ను పలుదఫాలుగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.అయన మాట్లాడుతున్నారే గానీ ఇప్పటిదాకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.ఎన్టీఆర్ సినీ భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకుని ఆ ఆహ్వానపు వ్యవహారాన్ని టీడీపీ మీద పరోక్ష ఒత్తిడి పెంచడానికే వాడుకున్నారు.అయినా ప్రయోజనం లేకపోవడంతో అయన రాజకీయంగా ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టేనని తెలుస్తోంది.

ఎలాంటి పరిస్థితులు ఎదురైనా హరికృష్ణ వైసీపీ లో చేరేంత కఠిన నిర్ణయం తీసుకుంటారా అన్నది కీలక ప్రశ్న.అలా చేయడం వల్ల వున్న విలువ కూడా పోవచ్చు.. ఎన్టీఆర్ సినీ భవిష్యత్ మీద ఎంతోకొంత ప్రభావం తప్పదు.వాటికి కూడా సిద్దపడేంత రిస్క్ చేసే అవకాశం లేదు.అయితే మరోసారి టీడీపీ అధిష్టానం మీద ఒత్తిడి పెంచడానికే ఈ లీకులు వదిలివుండొచ్చని కూడా కొందరి వాదన.కానీ హరికృష్ణ వైఖరి తెలిసిన వారికి అయన అంత వ్యూహాత్మకంగా వుంటారనుకోలేము. టీడీపీ వైపు నుంచి కూడా ఓ రాజీ ప్రయత్నం గురించి ఆలోచన మొదలైనట్టు సమాచారం.ఏదేమైనా హరికృష్ణ తీసుకోబోయే నిర్ణయం అయన రాజకీయ భవిష్యత్ తో పాటు ఏపీ రాజాకీయాల మీద ప్రభావం చూపడం ఖాయం.

SHARE