Posted [relativedate]
అక్కినేని మల్టీస్టారర్ మనంతో కాస్త స్టార్ లెగసీ ఉన్న ఫ్యామిలీలు అంతా మనకు ఇలాంటి మధురమైన జ్ఞాపకం లాంటి సినిమా ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నారు. అసలైతే గోవిందుడు అందరి వాడేలే మల్టీస్టారర్ ప్రయత్నించినా కుదరలేదు. ఇక ఓ పక్క మెగా మల్టీస్టారర్ కథ కోసం వేట మొదలవగా ఇప్పుడు తాజాగా నందమూరి మల్టీస్టారర్ కు కథలు వినడం మొదలు పెట్టారట. నందమూరి మల్టీస్టార్ అంటే బాలకృష్ణ, ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం అనుకుంటే పొరబడినట్టే. కేవలం హరికృష్ణ, కళ్యాణ్ రాం, ఎన్.టి.ఆర్ లు మాత్రమే కలిసి నటించే ఆలోచనలో ఉన్నారట.
ఇప్పటికే ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథకు ఓకే చెప్పారని అంటున్నారు. వైవిఎస్ చౌదరితో సినిమాలు చేసిన హరికృష్ణ అనారోగ్యం కారణంగా కొద్దికాలంగాసినిమాలకు దూరమయ్యాడు ఇక ఇప్పుడు మరోసారి ఆయన సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటాలని చూస్తున్నారు. కల్యాణ్ రాం కూడా ఇందులో ఓ ప్రత్యేకమైన పాత్రం చేస్తున్నారట. ఇక జూనియర్ కూడా స్పెషల్ అప్పియరెన్స్ లో కనిపిస్తాడట. సో తండ్రిని మళ్లీ హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో తనయులిద్దరు సినిమాలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా పట్ల అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుంది. ఓ విధంగా నందమూరి మల్టీస్టారర్ గా అనిపిస్తున్న ఈ సినిమా ఫ్యాన్స్ ను ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో చూడాలి.